కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినా నెల్సన్ దిలీప్ కుమార్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొలమవు కోకిల సినిమాతో దర్శకుడిగా కెరియర్ ను ప్రారంభించాడు. ఈ సినిమా తమిళంలో మంచి విజయం సాధించింది. ఇదే సినిమాను కోకోకోకిల పేరుతో తెలుగులో విడుదల చేయగా, ఈ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.

ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ డాక్టర్ సినిమాతో అదిరిపోయే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాను తెలుగులో వరుణ్ డాక్టర్ పేరుతో విడుదల చేయగా ఈ మూవీ తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇలా వరుసగా రెండు విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తాజాగా బీస్ట్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయిన తలపతి విజయ్ హీరోగా నటించాడు. ఈ సినిమాను దర్శకుడు నెల్సన్ దిలీప కుమార్ దాదాపుగా చాలా శాతం ఒకే మాల్ లోనే చిత్రీకరించాడు. ఒక మల్ ను ఉగ్రవాదులు హైజాక్ చేయడం, అక్కడే ఉన్న హీరో వారందరినీ కాపాడడం అనే కథ చుట్టూ బీస్ట్ మూవీ ఉంటుంది. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇది ఇలా ఉంటే నెల్సన్ దిలీప్ కుమార్ , రజనీ కాంత్ తో ఒక సినిమా చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమాకు జైలర్ అనే టైటిల్ కూడా కన్ఫర్మ్ చేశారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం రజనీ కాంత్ 'జైలర్' మూవీ లో ఖైదీ గానో లేదా జైలర్ గానో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటె ఈ సినిమా కూడా బీస్ట్ మూవీ మాదిరిగానే ఒకే ఒక  ప్రదేశంలో సినిమా ఎక్కువ శాతం ఉన్నట్లు తెలుస్తోంది. జైలు సెట్ లో జైలర్ సినిమా ఎక్కువ శాతం ఉండనునట్లు సమాచారం. మరి మాల్ లో దాదాపు ఎక్కువ శాతం చిత్రీకరించిన బీస్ట్ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు,  అయినప్పటికీ నెల్సన్ దిలీప్ కుమార్, సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీతో అలాంటి రిస్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: