టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల సర్కారు వారి పాట సినిమాతో భారీ విజయం సాధించాడు.అయితే  ఆ సినిమా విజయం తర్వాత ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్ కి వెళ్లిన సంగతి మనందరికి తెలిసిందే.అంతేకాకుండా ఇటీవల యూరప్ అంతా తిరిగి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడు.ఇదిలావుంటే ప్రస్తుతం మహేష్ న్యూయార్క్ లో ల్యాండ్ అయ్యాడు.ఇకపోతే న్యూయార్క్ వెళ్లిన మహేష్ తాజాగా ప్రపంచ కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ని కలిసాడు. ఐతేన్బుధవారం ఉదయం భార్య నమ్రతతో కలిసి బిల్‌గేట్స్ ని కలిసాడు మహేష్ బాబు. 

బిల్ గేట్స్ తో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇక  ఈ ఫోటోని షేర్ చేస్తూ.. 'బిల్‌గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది.అయితే  ప్రపంచంలోని అత్యుత్తమ వ్యక్తుల్లో ఒకరు. పోతే మోటివేట్ చేసే వ్యక్తి, ఎంతో గౌరవమైన వ్యక్తిని కలిసినందుకు హ్యాపీగా ఉంది' అంటూ పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ తర్వాత బిల్‌గేట్స్ తో కొద్దీ సమయం ముచ్చటించారు మహేష్ దంపతులు.ఇక.ప్రస్తుతం మహేష్ బిల్‌గేట్స్ తో దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే  మహేష్  అభిమానులు ఈ ఫోటోని మరింత షేర్ చేస్తున్నారు.ఇకపోతే  త్వరలోనే మహేష్ ఇండియాకి తిరిగి వచ్చి త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టనున్నారు.

ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను కంప్లీట్ చేసిన త్రివిక్రమ్ ఈ సినిమాలో మహేష్ బాబును విభిన్న తరహాలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక పీరియాడికల్ టైం ట్రావెలింగ్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని ఈ సినిమాలో మహేష్ బాబు తండ్రి, కొడుకులుగా కనిపించబోతున్నారని సమాచారం వినిపిస్తోంది. ఇక ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వార్తతో అభిమానులు సినిమాపై మరోసారి అంచనాలు పెంచుకుంటున్నారు. ఇక హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ఎస్ థమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: