బాహుబలి చిత్రం తరవాత వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలను పట్టా లెక్కిస్తున్నారు హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తరవాత వచ్చిన సాహో సినిమా టాలీవుడ్ లో ఆశించిన ఫలితాన్ని అందించలేదు... కానీ నార్త్ లో మాత్రం ఓ రేంజ్ లో వసూళ్లు రాబట్టింది. ఆ తర్వాత ఇటీవల ప్రభాస్ నుండి వచ్చిన మరో పాన్ ఇండియా మూవీ రాధే శ్యామ్ మాత్రం ఊహించని రీతిలో డిజాస్టర్ గా నిలిచింది. అయిన ప్రభాస్ క్రేజ్ ఇసుమంత కూడా తగ్గలేదు. డార్లింగ్ కి అభిమానుల్లో అంతా ఫాలోయింగ్ ఉంది. సినిమా ఫెయిల్ అయితే అది కథలో లోపమో లేక దర్శకుడి టేకింగ్ లో పొరపాటో తప్ప ప్రభాస్ మాత్రం 100 కి 100 న్యాయం చేస్తాడు అంటూ ప్రేక్షక అభిమానులు ఎపుడు రెబల్ స్టార్ ని నెత్తిన పెట్టుకొని కొనియాడుతుంటారు.

ఇక ఇపుడు అంతా కూడా ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ఆదిపురుష్' కోసం ఫుల్ వెయిటింగ్ అనే చెప్పాలి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా ? ఎపుడు తమ అభిమాన హీరోని ఆ ప్రభువు రాముని పాత్రలో తిలకిస్తామా అని అంతా వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రాబోతున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 15 భాషల్లో .. వరల్డ్ వైడ్‌గా 20,000 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదల చేయనున్నట్టు వార్తలు వినపడుతున్నాయి. నిజం చెప్పాలంటే 'ఆదిపురుష్' సినిమా పాన్ ఇండియా లెవల్ కాదు అంతకు మించి అన్నమాట. పాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కానుంది ఈ మూవీ భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు నమోదు చ్రయనుంది.

తాజాగా ఈ సినిమాను 3Dతో పాటు డాల్బీ లో కూడా  విడుదల చేయదనికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇక ఇపుడు తాజా సమాచారం ఏమిటంటే ప్రభాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి 20 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయబోతున్నట్లు తెలిపారు. ఇది నిజంగా గొప్ప వార్తే. ఇక ఈ చిత్రం లో కృష్ణం రాజు కూడా కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: