టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు గురించి అందరికీ కూడా పరిచయమే. తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకొని టాలీవుడ్ లో అప్పుడు పెద్ద స్టార్ హీరోయిన్ గా నిలిచింది.తన అందంతో మాత్రం అప్పటి కుర్రాళ్లను బాగా ఆకట్టుకొని తన వలలో వేసుకుంది. ఇక ఈమె తెలుగుతో పాటు హిందీ, ఉర్దూ, మలయాళ, తమిళ, ఇంగ్లీష్, మరాఠీ ఇంకా అలాగే బెంగాలీ ఇలా అన్ని భాషలలో నటించి టాక్ అఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ వయసుకు తగ్గ పాత్రలలో నటిస్తుంది.ఇక టబు సినీ ఇండస్ట్రీకి తొలిసారిగా బాలనటిగా అడుగు పెట్టింది. ఇక 1991వ సంవత్సరంలో కూలి నెంబర్ వన్ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమై తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయింది. ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో అవకాశాలు అందుకోని నటించింది. ఏడాదికి దాదాపు ఐదారు వరుస సినిమాలలో నటించే అవకాశాన్ని కూడా ఆమె అందుకుంది. ఇంకా అలాగే మొత్తం 75 కి పైగా సినిమాలలో నటించిన టబు ఎక్కువగా స్టార్ హీరోల సినిమాల్లోనే చాలా ఎక్కువ అవకాశాలు అందుకుంది.ఈమె ఇప్పటికీ లేటు వయసులో ఉన్నా కూడా చెరగని అందంతో బాగా ఆకట్టుకుంటూ కనిపిస్తుంది. ఇక ఈమె ఇప్పటివరకు కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతుంది.


ఇక టాలీవుడ్ కి దూరంగా ఉంటూ ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా బిజీ నటిగా మారింది. టబు ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం తన సమయాన్ని గడుపుతుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఇంకా అలాగే వ్యక్తిగత విషయాలను కూడా బాగా పంచుకుంటుంది. ఇక ఈమెకు సోషల్ మీడియాలో కూడా చాలా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఉంది.అయితే అప్పట్లో ఈమె రెమ్యూనరేషన్ మాత్రం విపరీతంగా ఉంటుందని టాక్. టాలీవుడ్ లో ఈమెకిచ్చే అంత రెమ్యూనరేషన్ లేకపోవటంతో ఈ అమ్మడు బాలీవుడ్ లోనే  ఇక సెటిల్ అయిపోయింది. అక్కడ ఆమె భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తుంది. పైగా ఆమె కోసం అక్కడ మేకర్స్ కూడా ఎక్కువ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని.. ఆమె కూడా తను అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తున్న వారికే ఎక్కువ డేట్స్ ఇస్తుంది అని తెలిసింది. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది అని తెలిసింది. కానీ ఈ అమ్మడి కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: