ఈరోజువిడుదల కాబోతున్న ‘పక్కా కమర్షియల్’ గోపీచంద్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది. ఈమూవీని అల్లు కాంపౌండ్ తో కలిసి యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించడంతో ఈమూవీ పై గోపీచంద్ చాలఆశలు పెట్టుకున్నాడు. దీనితో ఈసినిమా ప్రమోషన్ ను కూడ గట్టిగా చేసాడు. ఈసందర్భంగా ఒకమీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేసాడు.


తన చిన్నతనంలో తను ఒంగోలు లో ఉన్నప్పుడు అప్పట్లో సరైన స్కూల్స్ లేకపోవడంతో తన తండ్రి టి. కృష్ణ తనకోసం అదేవిధంగా తన అన్న కోసం ఒక మంచి స్కూల్ ను ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ ఆస్కూల్ ను తాము ఇప్పటికీ నడుపుతున్న విషయాన్ని బయటపెట్టాడు. తనతండ్రి చనిపోయే సమయానికి తన వయసు 9సంవత్సరాలని అయితే తనతండ్రి చనిపోయిన తరువాత తన కుటుంబంలో మారిన పరిస్థితులు బాగా గుర్తున్నాయి అంటూ అందువల్లనే తాను కష్టపడి చదివి రష్యాకు వెళ్ళి ఇంజనీరింగ్ చేసిన విషయాన్ని బయటపెట్టాడు.

అయితే అనుకోకుండా తన అన్నయ్య కూడ చనిపోవడంతో తనకు ఏమిచేయాలో తెలియకా చాల బెంగపడ్డ విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. వాస్తవానికి తాను సినిమా హీరో అవుతానని ఎప్పుడు అనుకొలేదనీ అయితే పరిస్థితులు తనను సినిమా హీరోగా మార్చాయి అని అంటున్నాడు. ఇప్పటి వరకు సినిమాలలో నటించిన గోపీచంద్ కు ఇండస్ట్రీలో రాణించాలి అంటే ప్రతిభతో పాటు లక్ కూడ చాల అవసరం అని అంటున్నాడు.


ఇండస్ట్రీలో ఇంతకాలం బట్టి ఉంటున్నప్పటికీ తనపై ఎటువంటి గాసిప్పులు రాలేదు అని చెపుతూ తనకు కూడ ఒక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉంది అన్న విషయాన్ని బయటపెట్టాడు. తాను ఇంజనీరింగ్ రష్యాలో ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజులలో తన కాలేజీ బస్ లో రోజుప్రయాణం చేసే ఒక రష్యన్ అమ్మాయి పై తనకు ప్రేమ పుట్టిన విషయాన్ని వివరించాడు. దీనితో ఒకరోజున ధైర్యంచేసి ఆరష్యన్ అమ్మాయి దగ్గరకు వెళ్ళి తాను ప్రేమిస్తున్న విషయాన్ని చెప్పినప్పుడు ఆమె షాక్ అయి తనకు ఇండియా అబ్బాయిలను చేసుకునే ఉద్దేశ్యం లేదు అంటూ తెగేసి చెప్పిన విషయాన్ని నవ్వుతూ బయటపెట్టాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: