అందాల ముద్దుగుమ్మ రాశి ఖన్నా తాజాగా గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీలో హీరోయిన్ గా నటించే విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయిన టీజర్ మరియు ట్రైలర్ లలో రాశి కన్నా తన అదిరిపోయే కామెడీ డైలాగ్ లతో,  తన డిఫరెంట్ మేనరిజంతో నవ్వులు పూయించింది. 

ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఈ రోజు అనగా జూలై 1 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్ర బృందం అనేక టీవీ ఇంటర్వ్యూలలో, సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాను ప్రమోట్ చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా తాజాగా రాశి కన్నా కూడా పక్కా కమర్షియల్ సినిమా విడుదల సందర్భంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా రాశి ఖన్నా అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

తాజా ఇంటర్వ్యూలో భాగంగా రాశి ఖన్నా కు మీకు ఎలాంటి పాత్రల్లో నటించడం అంటే ఇష్టం...  మొట్ట మొదటి సారి పక్కా కమర్షియల్ మూవీ లో ఫుల్ లెంత్ కామెడీ రోల్ లో నటిస్తున్నారు కదా,  ఈ పాత్ర ఎలా అనిపించింది, అనే ప్రశ్న ఎదురైంది... ఈ ప్రశ్నకు రాశి కన్నా ఏ మాత్రం మొహమాటం లేకుండా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంటే  ఇష్టం అని చెప్పేసింది. రాశి ఖన్నా కామెడీ పాత్రలు చేయడం కంటే రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం చాలా సులభం అని రాశి కన్నా తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటివరకు నేను చాలా సినిమాల్లో రొమాంటిక్ సన్నివేశాల్లో నటించాను. అలాంటి పాత్రలో నటించి బోర్ కొట్టింది. పక్కా కమర్షియల్ మూవీ లో నటించిన కామెడీ పాత్ర చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: