జబర్దస్త్ కమెడియన్స్ కి ప్రస్తుతం ఏ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీరికి సంబంధించి ఏదైనా ఒక విషయం సోషల్ మీడియాలోకి వచ్చింది అంటే చాలు అది క్షణాల్లో వ్యవధిలో వైరల్గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇప్పుడు జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయేల్ కు సంబంధించిన వార్త ఒకటి వైరల్ గా మారిపోతుంది. ఇటీవలే సుమా కోపంతో జబర్దస్త్ ఇమాన్యుల్ ఫోన్ పగలగొట్టింది.  దీంతో అభిమానులు అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఇంతకీ ఏం జరిగిందంటే ప్రస్తుతం ఈ టీవీ లో క్యాష్ షో ప్రతి వారం కూడా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది అనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వారం కూడా నలుగురు గెస్ట్ లను పిలవడం వారితో ఆసక్తికర స్కిట్ లు ఆడించడం లాంటివి చేస్తూ ఉంటుంది. ఇక మధ్యమధ్యలో సుమ స్పాంటేనియస్ పంచులు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి అని చెప్పాలి. క్యాష్ షోలో అటు చోర్ బజార్ టీం ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది.  ఇక ఇందులో భాగంగా హీరో హీరోయిన్ తో పాటు జబర్దస్త్ కమెడియన్ ఇమ్మానియేల్, రచ్చ రవి వచ్చారు.


 అయితే ఇక ఇటీవల విడుదలైన ప్రోమోలో చూసుకుంటే ఇమాన్యుయేల్ రెచ్చిపోయిన యాంకర్ సుమ పై పంచులు వర్షం కురిపించాడు. ఈ క్రమంలోనే ఈ క్రమంలోనే ఒక టాస్క్ లో భాగంగా ఆకాష్ పూరి ని సెల్ఫీ అడుగుతాడు ఇమ్మానుయేల్. ఇంతలో హీరోయిన్ తో ఫోటో దిగడానికి ప్రయత్నిస్తుంది  యాంకర్ సుమ. పాపం ముసలావిడ మీతో ఫోటో దిగడానికి ప్రయత్నిస్తోంది అంటూ సుమ పై పంచ్ వేస్తాడు ఇమ్మానియేల్.   దీంతో ఒక్కసారిగా ఇమాన్యుయేల్ ఫోన్ లాక్కున్న సుమ కిందికి విసిరేస్తోంది. వద్దు వద్దు అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఫోన్ విసిరేస్తుంది సుమ. ఇక ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: