ఇప్పటివరకు ఫ్లాప్ అన్నపదం తెలియని కొరటాల శివకు ‘ఆచార్య’ పరాజయం అన్నపదాన్ని పరిచయం చేసింది. ఈసినిమా వల్ల కొరటాల తన హిట్ ట్రాక్ సెంటిమెంట్ ను పోగొట్టుకోవడమే కాకుండా కోట్లాది రూపాయలలో భారీగా నష్టాలను ఎదుర్కొనవలసి వచ్చింది అని అంటారు.  అయితే చేసే పనిని తప్ప సెంటిమెంట్స్ ను పట్టించుకోని కొరటాల ఈసారి తన ‘కృష్ణమ్మ’ ను నమ్ముకున్నాడు. యంగ్ హీరో సత్యదేవ్ తన సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదులుకుని హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరసపెట్టి చిన్న సినిమాలు చేస్తున్నాడు. మరొకవైపు పెద్ద హీరోల సినిమాలలో కూడ ముఖ్యమైన పాత్రలు చేస్తున్నాడు. అయితే అతడికి ఇప్పటివరకు క్లాస్ లేదంటే మాస్ ప్రేక్షులలో ఎక్కడా సరైన ఇమేజ్ ఏర్పడకపోవడంతో అతడి సినిమాలకు కలక్షన్స్ పెద్దగా రావడంలేదు అన్న వార్తలు వినిపిస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో కొరటాల సత్యదేవ్ లు కలిసి చేస్తున్న ఒక చిన్న మూవీ పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తి కనపడుతోంది. ఈసినిమాకు కొరటాల నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ‘కృష్ణమ్మ’ అన్న టైటిల్ తో విడుదల కాబడ్డ ఈమూవీ ఫస్ట్ లుక్ చాలామందిని ఆకర్షిస్తోంది. ఈమూవీని అరుణాచల క్రియేషన్స్ బ్యానర్ మీద కృష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీవీ గోపాల కృష్ణ అనే యంగ్ డైరెక్టర్ ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.యాక్షన్ డ్రామాగా నిర్మాణం పూర్తి చేసుకున్న ఈమూవీ ఫస్ట్ లుక్ పోష్టర్ లో సత్యదేవ్ కత్తి పట్టుకుని నిలబడటంతో ఇదొక రివెంజ్ డ్రామా అని అర్థం అవుతోంది. మంచి చెడుల కలయిక పగ ప్రేమ కథలు చాల వచ్చాయి అయితే టేకింగ్ స్క్రీన్ ప్లే వెరైటీగా చెప్పగలిగితే ప్రేక్షకులు చూస్తున్నారు. కీరవాణి కొడుకు కాల భైరవ ఈమూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు. చాలాకాలంగా కీరవాణి వారసుడుగా కాల బైరవ రాణించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ అదృష్టం కలిసి రావడంలేదు. దీనితో సత్యదేవ్ కొరటాల కాల బైరవ లకు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి..మరింత సమాచారం తెలుసుకోండి: