మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రామ్ చరణ్  ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అలాగే తాజాగా విడుదలయిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో రామ్ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ వున్న రామ్ చరణ్ సినిమాల్లో మాత్రం అదిరిపోయే రేంజ్ లో బీభత్సం సృష్టించినప్పటికీ నిజ జీవితంలో మాత్రం చాలా సైలెంట్ గా ,  సింపుల్ గా ఉంటాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఎవరితో నైనా కలిసి పోవడం , చిన్న నటీనటులతో కూడా చాలా మంచిగా మెలగడం ఇలా రామ్ చరణ్ కు ఎన్నో ప్రత్యేక గుణాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే మరొక సారి రామ్ చరణ్ తనలో ఉన్న మంచి వ్యక్తిత్వాన్ని చాటుకున్నాడు. అసలు విషయం లోకి వెళితే... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకుల్లో ఒకరైన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో చాలా మంది తెలుగు నటీనటులు నటిస్తున్నారు. 

అందులో భాగంగా ఈ మూవీ లో తెలుగు కమెడియన్ అయినా సత్య కూడా ఒక ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ మూవీ తాజా షెడ్యూల్ లో భాగంగా రామ్ చరణ్ సన్నివేశాలతో పాటు కమెడియన్ సత్య సన్నివేశాలు కూడా పూర్తి అవడంతో ఇద్దరు కూడా హైదరాబాద్ తిరిగి రావాల్సి ఉంది. దానితో రామ్ చరణ్ తన ప్రైవేట్ ఫ్లైట్ లో కమెడియన్ సత్య ను కూడా తీసుకు వెళ్లి రామ్ చరణ్ తన గొప్ప మనసును మరోసారి చాటుకున్నాడు.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: