
ఈ క్రమంలోనే కేవలం ముఖం విషయంలోనే కాదు ఇక బాడీలోని అన్ని పార్ట్ ల కూడా తమకు నచ్చినట్లుగా మార్చుకునేందుకు ఈ సర్జరీలను ఆశ్రయిస్తున్నారు ఎంతో మంది సెలబ్రెటీలు. ఇక ఇలా సర్జరీలు చేయించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. కాని కొంతమంది విషయంలో మాత్రం తమా అందం పెరగాలని సర్జరీ చేయించుకుంటే చివరికి సర్జరీ వికటించడంతో అందంగా మారడం కాదు ఉన్న అందం పోయి అందవిహీనంగా మారిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది.
యూఎస్ కు చెందిన ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియాన్ లా కనిపించాలని జెన్నీఫర్ పంపాలోన అనే బ్రెజిల్‌కు చెందిన యువతి పన్నెండేళ్లలో ఏకంగా నలభై కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంది. అయితే ఇందుకోసం ఏకంగా 4.50 కోట్ల ఖర్చు చేయడం గమనార్హం. ఆ తర్వాత ఆ యువతి నిజంగానే ప్రముఖ మోడల్ లా మారింది అనే టాక్ కూడా వచ్చింది. ఆ తర్వాత మోడలింగ్ లో ఎన్నో అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. సైడ్ఎఫెక్ట్స్ రావడంతో.. ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయ్. దీంతో ఇకమళ్లీ తన రూపం తనకు వచ్చేలా 40 సర్జరీలు ఒకేసారి చేయించుకుంది. చివరికి అందవిహీనంగా మారిపోయింది.