తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్న ముద్దుగుమ్మలో కృతి శెట్టి ఒకరు. టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉప్పెన సినిమాతోనే కృతి శెట్టి అదిరిపోయే విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకోవడం మాత్రమే కాకుండా ఆ సినిమా వంద కోట్లకు పైగా కలెక్షన్లను సాధించింది.

ఆ తర్వాత కృతి శెట్టి , నాని హీరోగా రాహుల్ సంకృతియన్ దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగరాయ్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో కాస్త ఈ ముద్దుగుమ్మ హాట్ గా కూడా కనిపించింది. అలాగే కొన్ని హాట్ సన్నివేశాలలో కూడా ఈ మూవీ లో కృతి శెట్టి నటించింది. శ్యామ్ సింగరాయ్ మూవీ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కృతి శెట్టి 'బంగార్రాజు' మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటివరకు హైట్రిక్ విజయాలను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఫుల్ జోష్ ఉన్న కృతి శెట్టి తాజాగా రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ది వారియర్ మూవీలో హీరోయిన్ గా నటించింది.

సినిమా జూలై 14 వ తేదీన తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం ఈ సినిమా మంచి విజయం సాధించేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా కనుక మంచి విజయం సాధించినట్లు అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగు మరియు తమిళ భాషలలో కూడా ఫుల్ క్రేజీ ని సంపాదించుకునే అవకాశం ఉంది. మరి కృతి శెట్టి 'ది వారియర్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: