తాజాగా టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమా ఇటీవల విడుదల అయిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ఊహించనీ విధంగా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న మెగా అభిమానులకు ఈ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇదిలావుంటే ఆచార్య సినిమాకు నష్టపరిహారంగా చిరంజీవి,రామ్ చరణ్ కలిసి తమ వంతుగా రూ. 20 నుంచి 25 కోట్ల వరకూ సెటిల్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

పోతే  ఈ చిత్రానికి వచ్చిన నష్టాలతో పోల్చుకుంటే.. ఇవి డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తిరిగి చెల్లింపులు చేయడానికి సరిపోవట. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బయ్యర్లు ఎగ్జిబిటర్లు కొరటాల పై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.ఇకపోతే ...దర్శకుడు కొరటాల శివ వల్ల మొదటి నుంచి ఆర్థికంగా అందరూ లాభపడ్డవారే ఉన్నారు. అయితే శివ కూడా ప్రతి సినిమాకు లాభం చేకూర్చే విధంగా ఆలోచించారు.  ప్రస్తుతం ఆచార్య సినిమా కారణంగా కొత్త తలనొప్పులు ఎదుర్కొంటున్నారని తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలో కొందరు డిస్ట్రిబ్యూటర్స్ కొరటాల ఆఫీస్ కు వచ్చి నష్టపరిహారం కోసం డిమాండ్ చేసినట్లు.. కొంత మేరకు వారికి సెటిల్ చేసి పంపించినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలావుండగా  ఏదేమైనా ఈ వ్యవహరమంతా కొరటాల మీద తీవ్ర ఒత్తిడి పడేలా చేసింది. అంతేకాదు  ఇప్పుడు అతనికి జూనియర్ ఎన్టీఆర్ మోరల్ సపోర్ట్ గా నిలవనున్నారని టాక్ నడుస్తోంది. ఇక  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో తన ఫ్రెండ్ సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పోతే అతి త్వరలో ఎన్టీఆర్ 30 ప్రారంభం కావాల్సి ఉండగా కొరటాల ఇప్పుడు ఫైనాన్షియల్ మ్యాటర్స్ సెటిల్ మెంట్తో మానసికంగా ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి వచ్చింది. అయితే ఇది తెలుసుకున్న ఎన్టీఆర్.. కొరటాలకు నైతిక మద్దతు ఇవ్వడానికి అతన్ని ప్రత్యేక సమావేశానికి ఆహ్వానించి ఈ సంక్షోభ పరిస్థితుల నుంచి బయటపడేసే మనో ధైర్యాన్ని అందించే అవకాశం ఉందనీ సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: