ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. అలా విడుదల అయ్యే సినిమాలకు సంబంధించి ట్రైలర్ లను కూడా మూవీ మేకర్స్ విడుదల చేస్తూ ఉంటారు. అలా మూవీ మేకర్స్ విడుదల చేసే ట్రైలర్ లలో కొన్ని మూవీలో ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తూ ఉంటాయి. అలాగే అదిరిపోయే రేంజ్ లో లైక్ లు కూడా వస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు విడుదల అయిన తెలుగు సినిమా ట్రైలర్ లలో 24 గంటల్లో అత్యధిక లైక్ లను సాధించిన 5 తెలుగు సినిమా ట్రైలర్ ల గురించి తెలుసుకుందాం.

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.24 మిలియన్ లైక్ లను సాధించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.21 మిలియన్ లైక్ లను సాధించండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా హీరోలుగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నిత్యా మీనన్ , సంయుక్త మీనన్ హీరోయిన్ లుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ మూవీ ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.11 మిలియన్ లైక్ లను సాధించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 1.06 మిలియన్ లైక్ లను సాధించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప సినిమా ట్రైలర్ విడుదల అయిన 24 గంటల సమయంలో 893 కే లైక్ లను సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: