మెగాస్టార్ చిరంజీవి  ప్రస్తుతం ఈ వయసులో కూడా  వరుసబెట్టి సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు అన్న సంగతి తెలిసిందే.అయితే  ఇందులో గాడ్‌ఫాదర్, భోళాశంకర్, మెగా154 సినిమాలు లైన్‌గా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.ఇకపోతే ఈ సినిమాల్లో మెగా 154 చిత్రాన్ని దర్శకుడు బాబీ తెరకెక్కిస్తుండగా, ఇక ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. పోతే అందుకు కారణం ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మరో స్టార్ హీరో మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తుండటం.అంతేకాదు ఇప్పటికే ఈ విషయాన్ని...

 చిత్ర యూనిట్ అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే  ఇక తాజాగా ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో మరో వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. ఇకపోతే ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోయిన్ కూడా నటించబోతుందట. కాగా మెగా154 చిత్రానికి 'వాల్తేరు వీరయ్య' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో చిరంజీవి, రవితేజ ఒకే తండ్రికి పుట్టిన సోదరులుగా కనిపించబోతున్నారట. కాగా చిరు సవతి తల్లి పాత్రలో సీనియర్ నటి జయసుధ నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అంతేకాదు రవితేజ తల్లి పాత్రలో జయసుధ నటిస్తుండగా, ఆమె కోసం ఆరాటపడుతూ రవితేజ చిరుతో చేతులు కలుపుతాడు. అయితే ఇక  వారిద్దరి దారులు వేరుకావడం, తల్లి కోసం రవితేజ చిరును ఎదురించడం లాంటి అంశాలు మనకు ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాదు ఈ సినిమాలో చిరంజీవి ఒక దొంగగా రవితేజపోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారని వార్తలు కూడా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్నాయిఇక  ఏదేమైనా చిరు 154 సినిమాకు సంబంధించి వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.అయితే  ఇక ఈ సినిమాలో చిరు సరసన అందాల భామ శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: