కొంతమంది హీరోయిన్ లకు హీరోలు ఎంతో సహకరిస్తూ ఉంటారు. వారి ఎదుగుదలకు ఎంతో తోడు అవుతూ ఉంటా రు. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా సదరు హీరోయిన్లకు హీరోలు ఎంతో హెల్ప్ ఫుల్ గా ఉంటారు కానీ కొంతమంది హీరోలు హీరోయిన్లకు ఏమాత్రం ఉపయోగపడకుండా ఉంటారు. వారిద్దరూ కలిసి సినిమాలో చేసిన కూడా సదరు హీరో యొక్క ప్రభావము లేదా మరి ఏదైనా కారణమేమో తెలియదు కానీ ఆ హీరోయిన్ కు ఎలాంటి అవకాశాలు కూడా రావు.

ఆ విధంగా ప్రస్తుతం టాలీవుడ్ లో విచిత్రమైన చర్చ జరుగుతుంది. అదే రవితేజ సరసన హీరోయిన్ గా నటించే ఏ హీరోయిన్ అయినా కూడా పెద్దగా అవకాశాలను అందుకోలేదట. ఆయన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతున్న నేపథ్యంలో ఆ టెన్షన్ లో ఉన్న రవితేజ అభిమానులు ఈ విధమైన విమర్శలు రావడం పట్ల మరికొంత కలవరపాటు గురవుతున్నారు.. కిలాడి సినిమాలో రవితేజ హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో నటించిన ఇద్దరి హీరోయిన్లకు ఏమాత్రం అవకాశాలు లేక పోవడం వారి అభిమానులను కలవర పరుస్తుంది. 

ఇక తాజాగా విడుదలైన సినిమా రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో హీరోయిన్ గా నటించిన దివ్యాంశ కౌశిక్ కెరియర్ కూడా అయోమయం లో ఉంది. అంతకుముందు రవితేజ హీరోయిన్లకు పెద్దగా సినిమా అవకాశాలు వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు ఆ విధంగా రవితేజ హీరోయిన్ల పట్ల కొంత శాపంగా మారుతున్నట్లు గా చెబుతున్నారు. ఇప్పటి పరిస్థితులను బట్టి తెలుస్తుంది. మరి రవితేజ సక్సెస్ సాధిస్తే ఈ రకమైన సెంటిమెంట్ ఏమైనా మారుతుందా అనేది చూడాలి. ఆయన చేతిలో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి అవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలే కావడం విశేషం ఈ నేపథ్యంలో రవితేజ హీరోయిన్లకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: