తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని పెంచిన వారిలో ప్రముఖ నటుడు ఎన్టీఆర్ తర్వాత వినిపించే పేరు అక్కినేని నాగేశ్వరావు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమ లో కొనసాగుతూ ఉన్నారు. అయితే నాగార్జున బాల నటుడి గానే తెలుగు పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చారు అనే విషయం తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయ మయ్యాడు అక్కినేని నాగార్జున. ఇక నాగ్ నటించిన విక్రమ్ సినిమా మంచి విజయాన్ని సాధించింది.  మజ్ను, సంకీర్తన సినిమాల ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు నాగార్జున.


 ఇలా నాగార్జున హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న సంకీర్తన సినిమాకు దర్శకుడిగా వ్యవహరించాడు గీతాకృష్ణ. అయితే ఇటీవల పలు ఇంటర్వ్యూ లలో సెలబ్రిటీల గురించి.. ఒకప్పుడు జరిగిన విషయాలు గురించి షాకింగ్ ఫాక్ట్స్ చెబుతూ సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారి  పోతున్నాడు. ఈ క్రమం లోనే నాగార్జునను హీరోగా తీసుకు  రావడం వెనుక పెద్ద కథ ఉంది అంటూ చెప్పుకొచ్చారు దర్శకుడు గీతాకృష్ణ. తాను దర్శకత్వం వహించిన సంకీర్తన సినిమాకు హీరోగా నాగార్జున తీసుకోవడం వెనుక చర్చలు జరిగాయట.


 నాగార్జున నటించిన సంకీర్తన సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కింది. అయితే అంతకు ముందు అన్నపూర్ణ స్టూడియోస్ చిరంజీవి డేట్లు కోసం ఎదురు చూస్తూ దాదాపు మూడేళ్ల నుంచి అతని చుట్టూ తిరుగుతూ ఉంది. మెగాస్టార్ డేట్ లు మాత్రం దొరక లేదు. నాగేశ్వర రావు కి కోపం వచ్చింది. దీంతో ఎవరినో ఎందుకు అని భావించి ఏకంగా నాగార్జునను విక్రమ్ సినిమా తో హీరోగా పరిచయం చేశాడు. చిరంజీవి కోసం ఎదురు చూసి విసిగి పోయిన నాగేశ్వరావు నాగార్జున ను తన బ్యానర్ లో హీరోగా పరిచయం చేశాడని దర్శకుడు గీతాకృష్ణ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: