అమీర్ ఖాన్ హీరోగా నాగచైతన్య కీలక పాత్రలో నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ ను సొంతం చేసుకోలేదు. ఈ సినిమాకు సంబంధించి వేల సంఖ్యలో షోస్ క్యాన్సిల్ అయ్యాయని కూడా వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయనే సంగతి తెలిసిందే.సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో నెగిటివ్ ప్రచారం కూడా జరగడంతో పాటు సినిమాకు ఫ్లాప్ టాక్ రావడంతో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు.అమీర్ ఖాన్ నాలుగేళ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త కూడా తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. అయితే ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటి, రాజకీయ నేత విజయశాంతి లాల్ సింగ్ చడ్డా మూవీ గురించి ఇంకా ఈ సినిమాను ప్రమోట్ చేసిన హీరోల గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. తాజాగా విజయశాంతి ఫేస్ బుక్ లో లాల్ సింగ్ చడ్డా మూవీకి సంబంధించి ఒక పోస్ట్ కూడా పెట్టారు.ఆ పోస్ట్ లో విజయశాంతి దేశవ్యాప్తంగా ఉన్న బాలీవుడ్ సినిమా ప్రేక్షకులు అమీర్ నైజం తెలిసి ఆయన్ని అసహ్యించుకుంటున్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కారణం వల్లే అమీర్ ఖాన్ పెట్టుబడిని వెనక్కు తెచ్చుకోవడం కోసం సౌత్ ఇండస్ట్రీపై ఇంకా ప్రధానంగా విదేశీ మార్కెట్ పై ఆధారపడ్డారని ఆమె చెప్పుకొచ్చారు.


టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా కూడా లాల్ సింగ్ చడ్డా పప్పులు ఉడకలేదంటూ ఈ సినిమాను ప్రమోట్ చేసిన చిరంజీవి ఇంకా నాగార్జున పేర్లు ప్రస్తావించకుండా విజయశాంతి సెటైర్లు వేయడం గమనార్హం.మేకవన్నెపులిలా ఉండే అమీర్ ఖాన్ అసలు తీరు గురించి బీజేపీ అభిమానులు ఇంకా హిందూ సంస్థలు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాయని విజయశాంతి చెప్పుకొచ్చారు.కరీనా కపూర్ తన సినిమాలు చూస్తే చూడండి లేదంటే లేదని అన్నారని ఆ వ్యాఖ్యల్లోని అహంకారాన్ని కూడా ప్రేక్షకులు బాగా అర్థం చేసుకున్నారని విజయశాంతి చెప్పుకొచ్చారు. ప్రజలు అమాయకులు అని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే ఇలాంటి ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుందని విజయశాంతి అన్నారు. లాల్ సింగ్ చడ్డా సినిమాకు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించగా నాగచైతన్య ఈ సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించడంతో నాగ్ కూడా ఈ సినిమాను ప్రమోట్ చేశారు. అందువల్ల ఈ ఇద్దరు హీరోలపై కూడా విజయశాంతి ఇలా సెటైర్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: