ఇక ఒకప్పుడు కేక్ వాక్ లాగా ఉన్న వంద కోట్ల వసూళ్లు ఇప్పుడు అందని ద్రాక్షలా మారిపోయాయి బాలీవుడ్ సినిమాలకు. పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా తొలి రోజు పది కోట్ల వసూళ్ల మార్కును అందుకోవడం చాలా కష్టం అయిపోతోంది. ఇక సినిమా రిలీజై అందులో విషయం లేకపోవడం వల్ల ఫ్లాప్ అయితే ఓకే అనుకోవచ్చు. కానీ విడుదలకు ముందే బాలీవుడ్ సినిమా ఫలితం నిర్ణయం అయిపోతోంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ అదే పనిగా హిందీ చిత్రాలను బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్స్ చేయడం.. ఇంకా రోజులు వారాల తరబడి నెగెటివిటీని స్ప్రెడ్ చేసి సినిమాలను కిల్ చేస్తుండటం వారికి ఆందోళనకరంగా మారుతోంది.అసలే కొవిడ్ దెబ్బకు అల్లాడిపోయిన బాలీవుడ్‌కు ఈ 'బాయ్‌కాట్' నినాదాలు అనేవి శరాఘాతంలా మారుతున్నాయి. సోషల్ మీడియాలో జనాలు నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తే ఏం జరుగుతుంది.. దాని వల్ల సినిమాలు ఆడకుండా పోతాయా అని తేలిగ్గా తీసుకున్న వాళ్లు 'లాల్ సింగ్ చడ్డా' సినిమాకు వచ్చిన ఓపెనింగ్స్ ఇంకా నెగెటివ్ టాక్ వైల్డ్ ఫైర్ లాగా విస్తరించిన వైనం చూసి అవాక్కవుతున్నారు. ఆమిర్ ఖాన్ సినిమాలకు ఒకప్పుడు టాక్‌తో సంబంధం లేకుండా తొలి రోజు ఇండియాలో రూ.25-30 కోట్ల మినిమం వసూళ్లు వచ్చేవి.


అలాంటిది 'లాల్ సింగ్ చడ్డా' సినిమాకు రూ.12 కోట్ల ఓపెనింగ్స్ మాత్రమే రావడం.. తొలి రోజు జనాలు లేక మొత్తం 1300 షోలు క్యాన్సిల్ కావడం విస్మయం కలిగిస్తోంది. ఇదంతా కూడా బాయ్‌కాట్ నినాదాల ఫలితం అన్నది స్పష్టం. ఇకపై ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకునే పరిస్థితి లేనే లేదు. బాలీవుడ్ దీనిపై ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుని దిద్దుబాటు చర్యలు చేపట్టడం.. ఇంకా తమ పరిస్థితిని జనాలకు వివరించే ప్రయత్నం చేయడం.. తమలో హిందూ వ్యతిరేక భావజాలం లేదని ఇంకా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ అందులో ఏ బాలీవుడ్ ప్రముఖుల పాత్ర లేదని వివరించడం..అలాగే ఒక సినిమా వెనుక ఉండే కష్టం, దాని మీద ఆధారపడ్డ కుటుంబాల గురించి ఆవేదన భరితంగా చెప్పే ప్రయత్నం చేయడం కూడా చాలా అవసరం అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: