బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న పాత్రలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కెరీర్ ని మొదలు పెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత మాస్ మహారాజా హీరోగా తెరకెక్కిన పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆంజనేయులు మూవీ తో ప్రొడ్యూసర్ గా తన కెరియర్ ను ప్రారంభించాడు.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గబ్బర్ సింగ్ మూవీ తో బండ్ల గణేష్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బండ్ల గణేష్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి వారితో సినిమాలను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మాత్రం బండ్ల గణేష్ సినిమాల నిర్మాణానికి కాస్త దూరంగానే ఉంటున్నాడు. కొన్ని రోజుల క్రితమే బండ్ల గణేష్ 'డేగల బాబ్జి' మూవీతో ప్రేక్షకులను పలకరించాడు.

ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా , నిర్మాతగా తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న బండ్ల గణేష్ తాజాగా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లకు ప్రేక్షకులు అలవాటు పడి థియేటర్ లకు రావడం లేదు అనే వాదనపై స్పందించాడు. మంచి కథనంతో అద్భుతమైన మూవీ లను తీస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. వేల కోట్ల రూపాయలతో మూవీ లను తీసి  , వంద కార్లను ఎగర వేసి , హీరో చేతిలో రాడ్ పట్టుకుని వంద మంది ని కొడితే జనాలు మూవీ కి వస్తారు అనుకోవడం తప్పు అని , గుండె హత్తుకునే మూవీ లను తీసినంత కాలం మనకు అపజయం లేదు బండ్ల గణేష్ తాజాగా చెప్పు కొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: