నిఖిల్ కార్తికేయ 2 సినిమా హిందీలో బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. అక్కడ బడా స్టార్ సినిమాలు లాస్ట్ వీక్ రిలీజ్ అవగా వాటిని పక్కన పెట్టి కార్తికేయ 2 సినిమాకు అక్కడ ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ క్రమంలో కార్తికేయ 2 ద్వారా హీరో నిఖిల్.. హీరోయిన్ అనుపమ కూడా అక్కడ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నారు. కార్తికేయ 2 సినిమాలో అనుపమ నటించడం ఆమెకి లక్కీగా మారింది. ఈ సినిమా ద్వారా తొలిసారి బాలీవుడ్ లో అడుగుపెట్టింది అనుపమ.

అయితే సినిమాలో అనుపమ పాత్రకి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో అనుపమకి బాలీవుడ్ మేకర్స్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి అనుపమ పరమేశ్వరన్ కి కాల్ వచ్చిందట. వారి సినిమాలో అనుపమని హీరోయిన్ గా అడిగారట. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తున్నారని తెలుస్తుంది. ఓ విధంగా కార్తికేయ 2 అనుపమ కెరియర్ కి సూపర్ హెల్ప్ చేసిందని చెప్పొచ్చు.

కార్తికేయ 2 డబ్బింగ్ సినిమాగా హిందీలో రిలీజైంది. ఇప్పుడు అనుపమ ఆ ప్రొడక్షన్ కి సైన్ చేస్తే అమ్మడు బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ అయినట్టే. ఇన్నాళ్లకు అనుపమకి లక్కీ ఛాన్స్ వచ్చిందని చెప్పొచ్చు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ 18 పేజెస్ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఈ రెండు సినిమాలు నిఖిల్, అనుపమల జోడీకి సూపర్ క్రేజ్ తెచ్చేలా ఉంది. అనుపమ మాత్రం ప్రస్తుతం కెరియర్ లో ఈ కొత్త జోష్ తో హుశారుగా ఉంది. అ..ఆ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అనుపమ యువ హీరోలతో జోడీ కడుతున్న స్టార్ క్రేజ్ దక్కించుకోవడంలో వెనకపడ్డది. ఫైనల్ గా కార్తికేయ 2 ద్వారా నేషనల్ లెవల్ లో క్రేజ్ తెచ్చుకుంటుది. ఇక బాలీవుడ్ సినిమాలు చేస్తే అక్కడ మరింత ఫ్యాన్స్ ని ఏర్పరచుకునే ఛాన్స్ ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: