టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు ఉన్న హీరోలలో ఒకరైన ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆది సాయి కుమార్ కెరీర్ ప్రారంభంలో  ప్రేమ కావాలి , లవ్లీ మూవీ లతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఆ తర్వాత ఈ హీరో వరుసగా అనేక మూవీ లలో హీరోగా నటించాడు.

కాక పోతే ఆ మూవీ లు ఏవి కూడా ఈ హీరో కు ప్రేమ కావాలి ,  లవ్లీ రేంజ్ విజయాలను బాక్సా ఫీస్ దగ్గర అందించలేక పోయాయి.  రేపు అనగా ఆగస్ట్ 19 వ తేదీన ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన తిస్ మర్ ఖాన్ అనే మూవీ విడుదల కాబోతుంది. ఈ మూవీ లో ఆది సాయి కుమార్ స్టూడెంట్ గా , రౌడీ గా , పోలీసు గా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించబోతున్నాడు. మరి ఈ మూవీ తో ఆయన ఆది సాయి కుమార్ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ఇది ఇలా ఉంటే తిస్ మర్ ఖాన్ మూవీ లో ఆది సాయి కుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.

పాయల్ రాజ్ పుత్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఆర్ ఎక్స్100 తో మంచి విజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర అందుకని , ఎంతో మంది కుర్రకారు మనసు దోచుకుంది. ఆ తర్వాత ఈ ముద్దు గుమ్మ కూడా అనేక మూవీ లలో నటించినప్పటికీ ఆర్ ఎక్స్100 మూవీ రేంజ్ విజయం ఈ ముద్దు గుమ్మకు కూడా బాక్సా ఫీస్ దగ్గర దక్కలేదు. పాయల్ రాజ్ పుత్ కూడా ఈ మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ప్రస్తుతం ఈ ఇద్దరికీ కూడా ఈ మూవీ విజయం చాలా ముఖ్యం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: