మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన 'ఉప్పెన' సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సాన తీసిన ఈ సినిమా ఏకంగా 50 కోట్లపైగా వసూళ్లు రాబట్టి వైష్ణవ్ తేజ్ కి రికార్డ్ హిట్ ఇచ్చింది.ఆ సినిమా తరువాత 'కొండపొలం' అనే సినిమా చేశాడు. అయితే ఆ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలీదు. ఇక వైష్ణవ్ తాజాగా నటిస్తున్న తాజా చిత్రం 'రంగరంగ వైభవంగా' ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది.ఈ సినిమాను దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా, పూర్తి ఫ్యామిలీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పాత్ర ప్రేక్షకులను అలరించడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది.కాగా, ఈ సినిమాలో అందాల భామ కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా, తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు ముగించుకుంది. ఈ సినిమాను చూసిన సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్‌ను అభినందించారు.


పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, రొమాంటిక్ అంశాలను కూడా కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దడంతో ఈ సినిమా కచ్చితంగా విజయాన్ని అందుకుంటుందని సెన్సార్ సభ్యులు చిత్ర యూనిట్ సభ్యులను అభినందించినట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేయడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్-కేతిక శర్మల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఖచ్చితంగా అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. కాగా ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 2న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.మరి ఈ సినిమా పంజా వైష్ణవ్ తేజ్ కి ఉప్పెన లాంటి భారీ హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: