ఎప్పటిలాగే ఈ వారం కూడా కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాయి. మొన్నటిదాకా మీడియం రేంజ్ సినిమాలు ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరించాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఈ మీడియం రేంజ్ సినిమాలు కూడా తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటాయని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. వాస్తవానికి పెద్ద సినిమాలేవి కూడా
ఈ రోజుల్లో వర్కౌట్ అవటం లేదు. భారీ స్థాయిలో పెద్ద బడ్జెట్ తో రూపొందిన సినిమాలు అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోయే మీడియం రేంజ్ సినిమాలను గురించి తెలుసుకుందాం. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ
అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే
సినిమా ఈ శుక్రవారం విడుదల కాబోతుంది.
ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా తప్పకుండా మంచి కాన్సెప్ట్ తో రూపొందుతుంది అని ప్రేక్షకులు భావిస్తున్నారు. కృతి శెట్టి ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించడం కూడా ఈ
సినిమా పట్ల ఆసక్తి కలగడానికి ముఖ్య కారణం.
ఇక మరొక
యువ హీరో కిరణ్ అబ్బవరం చేస్తున్న మీ అందరికీ కావాల్సిన వాడిని అనే
సినిమా కూడా ఈ శుక్రవారం విడుదల కావడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ఈ
హీరో ఇప్పుడు ఈ మూడవ సినిమాతో కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు ఆయనకు ఎంతటి స్థాయిలో గుర్తింపు తీసుకువస్తాయో చూడాలి. సీతారామం
కార్తికేయ ఒకే ఒక జీవితం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరింప చేస్తున్న
టాలీవుడ్ చిత్ర
పరిశ్రమ ఇప్పుడు ఈ సినిమాల ద్వారా ఆ విజయాలను కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి. ఇక
తమిళ సినిమా ముత్తు కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.