కంగనారనౌత్ మాట్లాడుతూ నిన్న సీతారామం సినిమా చూశాను. హను రాఘవపూడి సినిమా టీం కి శుభాకాంక్షలు అంటూ తెలిపింది. అంతేకాదు సినిమా చాలా అద్భుతంగా ఉంది అని , ఈ ఎపిక్ లవ్ స్టోరీ చూస్తున్నంత సేపు మధురానుభూతి కలుగుతుంది. అంటూ ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు.. ముఖ్యంగా సినిమా స్క్రీన్ ప్లే అయితే అత్యద్భుతం .. అలాగే హీరోయిన్ మృణాల్ టాగూర్ గురించి కూడా మరొక స్పెషల్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమాలో నటీనటులందరూ కూడా తమ నటనను చాలా చక్కగా కనబరిచారు. ప్రత్యేకంగా మృనాల్ ఠాగూర్ చాలా అద్భుతంగా నటించింది. ఇక భావోద్వేగా సన్నివేశాలలో ఆమె నటించిన తీరు మహాద్భుతం.
ఇక తనలా మరెవరు నటించలేరు అనేంతగా తన నటన కనబరిచింది. మృణాల్ ఠాగూర్ నిజంగానే రాణి.. జిందాబాద్ ఠాకూర్ సా.. ఇక ముందు ముందు కాలం మీదే అంటూ మృణాల్ పై ప్రశంసలు కురిపించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్ ను ఎప్పుడో దాటేసింది.