తాజాగా స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పొన్నియిన్ సెల్వన్.. ఇక ఈ సినిమా ఈనెల 30వ తేదీన థియేటర్లలో చాలా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను చిత్ర బృందం హైదరాబాదులో నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హరితేజ , హేమంత్ కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇకపోతే అప్పటివరకు బాగానే యాంకరింగ్ చేసిన హరితేజ.. ఆ తర్వాత త్రిష స్టేజ్ మీదకు రాగానే మాట్లాడడంలో తడబడింద.. ఇక ఈ క్రమంలోని త్రిష తో ఏం మాట్లాడాలో తెలియక హరితేజ ఇబ్బంది పడిందని చెప్పవచ్చు.

చాలాకాలం తర్వాత హైదరాబాద్ వచ్చిన త్రిషని చూసి మళ్లీ ఇంత గ్యాప్ తీసుకొని రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ తన సంతోషం వ్యక్తం చేసింది హరితేజ.. ఇక ఈ క్రమంలోనే త్రిష మాట్లాడుతూ.. చాలాకాలం తర్వాత తాను హైదరాబాదుకు తిరిగి వచ్చినా కూడా అభిమానులు ఎంతో ప్రేమతో,  ఆప్యాయతతో ఆదరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు అంటూ తెలిపింది.  అంతే కాదు తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శకుడికి , దిల్ రాజ్ కి స్పెషల్ థాంక్స్ తెలిపింది త్రిష.. ఇక ఆ తర్వాత హరితేజ మాట్లాడుతూ.. నేను నా మొదటి సినిమా ఆడవారి మాటలకు అర్థాలే వేరులే మీతోనే కలిసి నటించాను. ఆ సినిమాలో నేను మీ చెల్లిగా నటించాను.. అప్పుడు మీ వెనుకే ఉండేదాన్ని అంటూ చాలా ఆనందంగా తెలిపింది. అంతేకాదు ఆ రోజు నుంచి ఇంటికి వెళ్లిన ప్రతిరోజు త్రిష నా ముందే ఉండేవారు అంటూ అద్దంలో చూసుకుని తెగ మురిసిపోయేదాన్ని అని కూడా తెలిపింది..

అప్పుడు మీతో పాటే కలిసి నటించాను. ఇప్పుడు మీకు  హోస్ట్ గా వ్యవహరిస్తున్నాను.. చాలా సంతోషంగా ఉంది అనడంతో వెంటనే త్రిష థ్యాంక్స్ చెబుతూ నా వయసు పెరిగింది అన్న అనుభూతిని హరితేజ కలిగిస్తోంది.. అయినా పర్లేదు.. ఆమె మాటను కాంప్లిమెంట్గా తీసుకుంటాను అంటూ హరితేజ కి రివర్స్ పంచ్ వేసింది  త్రిష.

మరింత సమాచారం తెలుసుకోండి: