టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ప్రస్తుతం ఈ యంగ్ హీరో హిట్ ప్లాప్  లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పోతున్నాడు ఈ యంగ్ హీరో.అయితే 'శతమానం భవతి' సినిమా తర్వాత శర్వానంద్ ఆ స్థాయి విజయం అందుకోలేదు. అనంతరం 'శ్రీకారం' తదితర సినిమాలతో ఓ మోస్తరు విజయం అందుకున్నాడంతే.ఇదిలావుంటే లేటెస్టుగా శర్వానంద్ నుంచి వచ్చిన 'ఒకే ఒక జీవితం' విమర్శకుల ప్రశంసలు అందుకుంది.అయితే సెప్టెంబర్ 16 వ తేదీన రిలీజైన ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో రూపొందిన సంగతి తెలిసిందే.

ఇకపోతే కొత్త దర్శకుడు శ్రీ కార్తీక్ ఈ సినిమాని తెరకెక్కించాడు. ఇక టైమ్ ట్రావెల్‌కి మదర్ సెంటిమెంట్ ఆపాదించి దర్శకుడు కథనాన్ని నడిపిన వైనం ఆడియన్స్‌ని కట్టి పడేసింది.కాగా  15 కోట్లకు రైట్స్ దక్కించుకున్న ఆ ఓటీటీ ఛానెల్..దాంతో సినిమాకి హిట్ కట్టబెట్టారు ప్రేక్షక దేవుళ్లు. ఇక అలా శర్వానంద్ తన కెరీర్‌లో హిట్టు లిస్టులోకి చేర్చుకున్నాడు 'ఒకే ఒక జీవితం' సినిమాని. అయితే ధియేటర్లలో ఈ సినిమాకి మంచి ఆదరణ దక్కింది. దాంతో నిర్మాతలకూ బాగానే లాభాలు తెచ్చిపెట్టింది. విడుదలైన ఆరు వారాల తర్వాత డిజిటల్ స్ర్టీమింగ్‌కి సిద్ధమవ్వాలి ఏ సినిమా అయినా.

ఇక ఆ క్రమంలోనే 'ఒకే ఒక జీవితం' డిజిటల్ హక్కుల్ని సోనీ లివ్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.ఇక  15 కోట్లకు సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని కైవసం చేసుకుందట.అయితే అక్టోబర్ రెండో వారంలో ఈ సినిమా ఓటీటీలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.ఇక  త్వరలోనే అధికారిక ప్రకటన రిలీజ్ చేయనున్నారు.  అయితే సీనియర్ నటి అమల ఈ సినిమాలో శర్వాకి తల్లిగా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక ధియేటర్లలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ ప్రేక్షకుల్లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: