సినీ ఇండస్ట్రీలో  సెంటిమెంట్స్ సర్వ సాధారణం.ఇక  దర్శకుడు త్రివిక్రమ్ కి కూడా ఓ సెంటిమెంట్ ఉంది.అయితే  ఆయన టైటిల్ 'అ' అక్షరంతో మొదలయ్యేలా జాగ్రత్తపడతారు.ఇకపోతే అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఆయన 'అ' సెంటిమెంట్ వదల్లేదు. అయితే వరుసగా అ ఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో అనే టైటిల్స్ తన చిత్రాలకు నిర్ణయించాడు. ఇక అజ్ఞాతవాసి మినహాయిస్తే ఈ చిత్రాల్లో అన్నీ హిట్స్, బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.ఇకపోతే  అజ్ఞాతవాసి మాత్రం డిజాస్టర్ అయ్యింది.

అంతేకాదు  అల వైకుంఠపురంలో ఇండస్ట్రీ హిట్ కొట్టిన నేపథ్యంలో మహేష్ కోసం అదే తరహా టైటిల్ అనుకుంటున్నారట.అయితే SSMB 28 మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ చిత్రం. గతంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా చిత్రాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించాడు.లేటెస్ట్ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇటీవలే కంప్లీట్ చేశారు. అయితే హైదరాబాద్ లో వేసిన ప్రత్యేకమైన సెట్స్ లో షూటింగ్ జరిపారు. ఈ చిత్ర టైటిల్ ఇదే అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది . అయితే దాని ప్రకారం త్రివిక్రమ్ 'అయోధ్యలో అర్జునుడు' అని నిర్ణయించారట.

అంతేకాదు తన సెంటిమెంట్ కలిసి వచ్చేలా టైటిల్ లో రెండు 'అ' లు ఉన్నాయి....టైటిల్ కూడా క్యాచీగా ఉంది.ఇక ఈ క్రమంలో మహేష్ చిత్రానికి 'అయోధ్యలో అర్జునుడు' ఫిక్స్ అంటున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ గట్టిగా ప్రచారం అవుతుంది.  మహేష్ తో చేస్తున్న ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ తో చేయాలనుకున్నదే అని సమాచారం. ఇకపోతే ఎన్టీఆర్ 30 త్రివిక్రమ్ తెరకెక్కించాల్సి ఉండగా ప్రకటన తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఈ క్రమంలో ఆ స్క్రిప్ట్ మహేష్ తో చేస్తున్నారట. ఇక అప్పట్లో 'అయిననూ పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారమైంది.కాగా  దానికి దగ్గరగా 'అయోధ్యలో అర్జునుడు' టైటిల్ ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: