పుష్ప' సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో  పాన్ ఇండియా లెవెల్లో అల్లు అర్జున్ క్రేజ్ పెరిగిపోయింది.అంతేకాదు  'పుష్ప : ది రైజ్'.. సినిమా దేశవ్యాప్తంగా దుమ్మురేపింది. ఇక ఎవరి నోట్లో చూసినా అదే డైలాగ్.. 'తగ్గేదే లే'. ఫ్యాన్స్ కావచ్చు.. రాజకీయ నాయకులు కావచ్చు.. క్రీడాకారులు కావచ్చు.. అందరూ డైలాగ్ చెప్పడం, మ్యానరిజం చూపించడం.అయితే  దేశంలోనే కాదు.. విదేశాల్లో 'పుష్ప' మేనియా కొన్ని రోజులు కొనసాగింది. ఇక దీంతో అల్లు అర్జున్‌కు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగిపోయింది. ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేసి మరీ మళ్లీ స్పెషల్ షోలు వేస్తున్నారట. 

అయితే ఇదే కాదు అల్లు అర్జున్ నటించిన ఓ యాడ్‌కు యూట్యూబ్‌లో ఏకంగా 0.95 మిలియన్ లైక్స్ వచ్చాయి.ఇక  అమెజాన్ ప్రైమ్‌లో 2022లో ఎక్కువ మంచి చూసిన సినిమాగా పుష్ప నిలిచింది. ఇక దీంతో ఈ అల్లు వారి పిల్లాడి సినిమా కోసం ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. అల్లు అర్జున్ నుంచి మరో మూవీ అప్డేట్ రాబోతోంది. అంతేకాదు ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ కుమార్.. అల్లు అర్జున్‌తో ఓ సినిమా చేయబోతున్నాడట. అయితే దీనికి అల్లు అర్జున్‌కు రూ. 100 కోట్ల పారితోషకం ఇవ్వబోతున్నారట.

ఇక  'కత్తి', '2.0' సినిమాలను నిర్మించిన సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను కూడా నిర్మిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి.ఇకపోతే హాలీవుడ్ భారీ హిట్ సాధించిన నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్ 'మనీహైస్ట్' స్టోరీ లైన్‌కు ఈ కథ దగ్గరగా ఉంటుందని సమాచారం. ఇక అట్లీ కథ చెప్పారని.. బన్నీ సానుకూలంగా స్పందించినట్టు వినిపిస్తోంది.ఇకపోతే  పుష్ప-2 షూటింగ్ ముగిశాక.. బన్నీ, అట్లీ సినిమా లుక్ టెస్టులో పాల్గొననున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. 'అల్లూరి' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు అల్లు అర్జున్. ఆయన తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బన్నీ తెలుగులో చాలా మంది సంపాదించుకున్నారు. అయితే ఇక్కడే కాదు కేరళలోనూ ఆయన్ను ముద్దుగా మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. ఇక ఏవైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం చేయడంలోనూ ముందుంటారు ఈ ఐకాన్ స్టార్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: