ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు దర్శకుడు మరియు నటుడు అయినటు వంటి రాఘవ లారెన్స్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . డాన్స్ కొరియో గ్రాఫర్ గా కెరియర్ ని మొదలు పెట్టి కొరియో గ్రాఫర్ గా అత్యున్నత స్థానానికి ఎదిగిన రాఘవ లారెన్స్ ఆ తర్వాత దర్శకుడు గా కూడా అనేక సినిమా లకు దర్శకత్వం వహించాడు . అందులో భాగంగా రాఘవ లారెన్స్ తెలుగు లో కూడా కొన్ని మూవీ లకు దర్శకత్వం వహించాడు . తెలుగు లో రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించిన మాస్ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది . అలాగే డాన్ ,  రెబల్ మూవీ లకు కూడా రాఘవ లారెన్స్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే రాఘవ లారెన్స్ నటుడి గా కూడా ఎన్నో మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు. ఎక్కువగా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన మూవీ లలో నటించి రాఘవ లారెన్స్ ప్రేక్షకులను అలరించాడు. కాంచన సిరీస్ మూవీ ల ద్వారా రాఘవా లారెన్స్ అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రాఘవ లారెన్స్ 'రుద్రుడు' అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఈ మూవీ కి కదిరేశన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రుద్రుడు మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. రుద్రుడు మూవీ ని 14 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: