నందమూరి నట సింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇప్పటికే ఎన్నో విజయవంత మైన మూవీ లలో నటించి తెలుగు సిని మా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరో గా కెరియర్ ని కొనసాగిస్తున్న బాలకృష్ణ కొంత కాలం క్రితం ప్రముఖ 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటు వంటి ఆహా 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబు ల్ అనే టాక్ షో కు  హోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే . కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరించి నప్పటికీ బాలకృష్ణ తన వాక్చాతుర్యం తో అన్ స్టాపబుల్ టాక్ షో ను అద్భుతమైన విజయం సాధించేలా చేశాడు . 

ఇలా అన్ స్టపబుల్ సీజన్ 1 అద్భుత మైన విజయం సాధించడం తో ఆహా నిర్వాహక బృందం అన్ అన్ స్టాపబుల్ సీజన్ 2 ను కూడా త్వరలోనే ప్రారంభించ బోతుంది . ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది . ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా నిర్వాహక బృందం అన్ స్టాపబుల్ సీజన్ 2 కు సంబంధించిన టీజర్ కి సంబంధించిన అప్డేట్ ను తాజాగా ప్రకటించింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 టీజర్ ను అక్టోబర్ 4 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఆహా 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. అన్ స్టపాబుల్ సీజన్ 2 కి సంబందించిన టీజర్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి. ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: