తెలుగులో అలనాటి హీరోయిన్లలో శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె అందంతో, నటనతో, మాటలతో ఎంతోమంది ప్రేక్షకులను సంపాదించింది. ఇక ఈమె నట వారసురాలుగా జాన్వి కపూర్ త్వరలోనే టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పటికే ఎంతోమంది అగ్ర హీరోల సరసన జాన్వికపూర్ నటిస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపించాయి.. కానీ ఇంతవరకు ఆ వార్తలు ఏవి నిజం కాలేదు. ఇటీవల కాలంలో ఎన్టీఆర్ 30వ సినిమాలో నటించబోతోంది అనే వార్తలు బాగా వినిపించాయి. జాన్వి కపూర్ ను సంప్రదించారా లేదా అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.కానీ ఇంతలోనే ఇ సినిమా లో హీరోయిన్లుగా చాలామంది నటిస్తున్నారనే వార్తలు చాలా వైరల్ గా మారాయి.


తాజా సమాచారం ప్రకారం జాన్వి కపూర్ ఒక భారీ మల్టీ స్టారర్ సినిమాకు సిగ్నల్ ఇచ్చిందని.. అక్షయ్ కుమార్ టైగర్ ష్రాఫ్ తో కలసి నటించబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. బడే మియాన్ చోటే మిషన్ అనే చిత్రం ఇటీవలే ప్రారంభమైంది దర్శకులు ఈ సినిమా గురించి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్లను ప్రకటిస్తూనే ఉన్నారు. ఇక గత నెలలో అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని సెట్స్ మీద నుండి ఇద్దరు ప్రధాన కారులతో కలిసి ఒక ఫోటోని షేర్ చేశారు.


ఈ చిత్రానికి ఆలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక జాన్వి విషయానికి వస్తే తన తదుపరి సినిమాలు అన్ని బాలీవుడ్ లోనే నటించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది ఇటీవల కాలంలో గుడ్ లక్ జెర్సీ సినిమాలకు కూడా నటించను ఈ సినిమాలో తన నటనకు మంచి గుర్తింపు వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాత మీలి అనే సినిమా విడుదల కాబోతోంది. ఇక ఇవే కాకుండా ఎన్నో సినిమాలు బిజీ షెడ్యూల్ తో ఉన్నందువల్ల ఎన్టీఆర్ సినిమాకి కాల్ సీట్లు లేనందు వల్ల ఏమీ ఆ సినిమాను రిజెక్ట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: