అతిలోక సుందరి అందాల తార శ్రీదేవి వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ తన అందంతో, నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.  ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ తో  కుర్రకారుకు చెమటలు పట్టించే ఈ ముద్దుగుమ్మ ఎప్పటికప్పుడు యువత మనసును ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు. శ్రీదేవి కోరిక మేరకు జాన్వి కపూర్ త్వరలోనే టాలీవుడ్ లో అరంగేట్రం చేస్తుందని అంతా భావించారు. అంతేకాదు పలువురు అగ్ర హీరోల సరసన ఈ ముద్దుగుమ్మను ఒప్పించడానికి ఎంతో మంది ప్రయత్నం చేస్తున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.  కానీ ఆ వార్తలను జాన్వీ కపూర్ ఇంతకుముందే ఖండించింది. ఇకపోతే తెలుగు అగ్ర హీరోల సరసన నటించడానికి అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని తెలిపింది.

ఇదిలా ఉండగా కొరటాల శివ , ఎన్టీఆర్ కోసం జాన్వీ కపూర్ ను  తీసుకోవాలని సీరియస్ గా ప్రయత్నిస్తున్నారు.. అంతేకాదు జాన్విని వారు సంప్రదించారా? లేదా..? ఒకవేళ ఆమె ఓకే చెప్పిందా? లేదా ? అనే వార్తలపై కూడా సరైన క్లారిటీ లేదు . కానీ ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్ సరసన కియారా అద్వానీ నటిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జాన్వీ కపూర్ భారీ మల్టీస్టారర్ కి సంతకం చేసిందట . బడే మియాన్ చోటే మియాన్ అనే సినిమాలో అక్షయ్ కుమార్ , టైగర్ స్టాఫ్ లతో కలిసి జాన్వి కపూర్ నటించబోతోంది . ఇక ఈ సినిమా జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.

ఇకపోతే ఈ సినిమా కోసం నిర్మాతలు కథానాయకగా జాన్వీ కపూర్ ను లాక్ చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఇక దీన్ని బట్టి చూస్తే జాన్వీ కపూర్ ఇప్పుడే తెలుగులో నటించే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఈ సినిమా తర్వాత మరొక భారీ ప్రాజెక్టును దక్కించుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ఈమె నటించిన గుడ్ లక్ జెర్రీ సినిమా కూడా మంచి విజయాన్ని అందించింది. ఇక ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి లో కూడా నటిస్తోంది జాన్వి కపూర్.

మరింత సమాచారం తెలుసుకోండి: