టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక మూవీ తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ రోజు నుండి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ లో రామ్ పోతినేని సరసన శ్రీ లీల హీరోయిన్ గా నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అలాగే రామ్ పోతినేని ,  బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి సంగీతాన్ని అందించబోయే సంగీత దర్శకుడి పేరును కూడా చిత్ర బృందం  ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. 

మూవీ కి న్సేషననల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ని కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే బోయపాటి శ్రీను ,  తమన్ కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు , అఖండ మూవీ లు భారీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ రెండు మూవీ లు కూడా మ్యూజికల్ గా కూడా ప్రేక్షకులను ఎంత గానో ఆదరించాయి. దానితో రామ్ పోతినేని , బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ కి తమన్ సంగీతాన్ని అందిస్తూ ఉండడంతో ఈ మూవీ సంగీతంపై ఇప్పటి నుండే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఈ సినిమాను దర్శకుడు బోయపాటి శ్రీను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందించబోతున్నారు. ఈ మూవీ పై రామ్ పోతినేని అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: