తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి నందమూరి బాలకృష్ణ మధ్య ఇప్పటినుంచి కాదు ఎప్పటినుంచో తీవ్రమైన పోటీ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఇక వీరిద్దరి సినిమాలు ఇప్పటివరకు ఎన్నోసార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి. ఒకసారి ఒకరూ పై చేయి సాధిస్తే.. ఇంకోసారి వేరొకరిపై చేయి సాధించడం జరిగాయి అని చెప్పాలి. అయితే ఇలా ఏ హీరో సినిమా  పై చేయి సాధించి ఎక్కువ వసూళ్లు సాధించిన ఇక ఆ హీరో అభిమానులు ఏకంగా సోషల్ మీడియా వేదికగా మరో హీరో సినిమాని ట్రోల్ చేయడం ఇటీవల సర్వసాధారణంగా జరుగుతుంది.


 ఇక ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా విషయంలో కూడా ఇదే జరుగుతుంది అన్నది తెలుస్తుంది. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా గాడ్ ఫాదర్ సినిమా అన్ని భాషల్లో విడుదలైంది. ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ కలెక్షన్లను ఇతర హీరోల అభిమానులు తమ హీరోల సినిమాలతో పోల్చి చూస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఏపీ సర్కార్ సినీ టిక్కెట్ల రేట్ల పై ఆంక్షలు విధించిన సమయంలో విడుదలైన అఖండ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.


 ఇప్పుడు రేట్లు ఎక్కువగా ఉన్న సమయంలో కూడా గాడ్ ఫాదర్ అఖండ రేంజ్ లో కలెక్షన్స్ సాధించలేకపోయింది అన్నది తెలుస్తుంది.. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.


అఖండ
నైజాం : 4.39 కోట్లు    , గాడ్ ఫాదర్ నైజాం: 3.29 కోట్లు. అఖండ
సీడెడ్ : 4.02 కోట్లు     గాడ్ ఫాదర్: 3.18 కోట్లు
ఉత్తరాంధ్రలో అఖండ 1.36 కోట్లు     గాడ్ ఫాదర్ 1.26 కోట్లు
ఈస్ట్ గోదావరిలో అఖండ 1.05 కోట్లు    , గాడ్ ఫాదర్ 1.60 కోట్లు.
వెస్ట్ గోదావరిలో అఖండ 96 లక్షలు,    గాడ్ ఫాదర్ 59 లక్షలు
గుంటూరు లో అఖండ 1.87 కోట్లు,    గాడ్ ఫాదర్ 1.75 కోట్లు.
కృష్ణ : 81 లక్షలు    కృష్ణా: 73 లక్షలు
నెల్లూరు : 93 లక్షలు    నెల్లూరు: 57 లక్షలు
కర్ణాటక +రెస్టాఫ్ ఇండియా అఖండ 1 కోటి    , గాడ్ ఫాదర్ 1.56 కోట్లు+ హిందీ; 45 లక్షలు

అఖండ ప్రపంచవ్యాప్తంగా: గాడ్ ఫాదర్ ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే..

 అఖండ 18.74 కోట్లు ( 29.5 కోట్లు గ్రాస్) గాడ్ ఫాదర్  17.08 కోట్లు (31.10 కోట్లు గ్రాస్).

మరింత సమాచారం తెలుసుకోండి: