తమిళ సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దలపతి విజయ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దలపతి విజయ్ తాను నటించిన అనేక మూవీ లను తెలుగు లో డబ్ చేసి  విడుదల చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకొని ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి మార్కెట్ ను సృష్టించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఆఖరుగా దళపతి విజయ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన బీస్ట్ మూవీ లో హీరోగా నటించాడు.

మూవీ తమిళ్ తో పాటు తెలుగు , కన్నడ , మలయాళ ,  హిందీ భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లో పూజా హెగ్డే , దళపతి విజయ్ సరసన హీరోయిన్ గా నటించగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం దళపతి విజయ్ , వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , తమన్మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ మూవీ తమిళ్ లో వరిసు టైటిల్ తో విడుదల కానుండగా ,  తెలుగు లో వారసుడు టైటిల్ తో విడుదల కాబోతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించంది. కాకపోతే విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని జనవరి 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో వెలపడే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: