తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాల తో బిజీగా ఉన్నాడు..మహేష్ బాబు ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న విషయం తెలిసిందే. వరుస విజయలతో దూసుకుపోతోన్న మహేష్ కోసం ఈసారి గురూజీ ఓ డిఫరెంట్ కథను సిద్ధం చేశారని తెలుస్తోంది.ఈ ఇద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా లు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో ను తెరకెక్కిస్తున్నాడట త్రివిక్రమ్. ఇప్పటికే మహేష్ షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ కూడా కంప్లీట్ అయ్యింది. ఓ భారీ యాక్షన్ సీన్స్ ను చిత్రీకరించట. అయితే ఇంతలోనే మహేష్ తల్లిగారు ఇందిరాదేవి కన్నుమూయడంతో షూటింగ్ కు బ్రేక్ పడింది.


ఈ సినిమాలో మహేష్ చాలా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. లాగ్ హెయిర్, గడ్డంతో రఫ్ గా కనిపించనున్నారు మహేష్. ఇప్పటికే మహేష్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..ఈ సినిమాలో మహేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించనున్నాడట. ఇప్పటివరకు మహేష్ సాఫ్ట్ వేర్ గా ఏ లోనూ కనిపించలేదు. ఈ పాత్ర కోసం మహేష్ లుక్ చేంజ్ చేశాడట. అంతే కాదు బరువు కూడా తగ్గాడట మహేష్. అంతే కాదు సిక్స్ ప్యాక్ ఉండేలా బాడీని డవలప్ చేశాడట. ఇప్పుడు తల్లిపోయిన బాధలో ఉన్న మహేష్ ఈ మూవీ షూటింగ్ కు ఎప్పుడు హాజరవుతారన్నది ఫిలిం సర్కిల్స్ లో ఆసక్తికర చర్చగా మారింది.మహేష్ త్రివిక్రమ్ ను వీలైనంత త్వరగా కంప్లీట్ చేయాలని అనుకున్నారు.


కానీ అది కుదరడం లేదు. సర్కారు వారి పాట తర్వాత మహేష్ విదేశాలకు వెళ్ళాడు. తిరిగి వచ్చిన తర్వాత తన తల్లి ఆరోగ్యం క్షీణించడంతో ఆమె దగ్గరే ఉంటూ సేవలు చేశారు. ఈ గ్యాప్ లోనే ఒక షెడ్యూల్ ను పూర్తి చేశారు.అయితే మహేష్ బాబు తల్లి చనిపోవడంతో మహేష్ బాబు గ్యాప్ తీసుకున్నాడు.ఈ నెల 15నుంచి మహేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఒక్కసారి జాయిన్ అయితే గ్యాప్ లేకుండా ను కంప్లీట్ చేయాలని చూస్తున్నారట మహేష్. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా,తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: