ప్రస్తుతం ఇండస్ట్రీతో పాటు ట్రేడ్ వర్గాల్లో చిరంజీవి హీరోగా వచ్చిన గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల మీద చాలా పెద్ద చర్చే జరుగుతోంది. దసరా పండగతో మొదలుపెట్టి అయిదు రోజుల పాటు నాన్ స్టాప్ వసూళ్లతో దుమ్ము రేపిన ఈ మెగా హిట్ ఉన్నట్టుండి సోమవారం నుంచి విపరీతంగా డ్రాప్ అవ్వడం ఫ్యాన్స్ ని ఆశ్చర్యానికి గురి చేసింది.90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగితే ఇప్పటిదాకా వచ్చింది 60 కోట్లకు దగ్గరలో. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చూస్తే దాన్ని రీచ్ కావడం దాదాపు అసాధ్యమే. అదే జరిగితే కమర్షియల్ సూత్రాల ప్రకారం ఈ సినిమాని ఫ్లాప్ గానే పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడే నిర్మాత ఎన్వి ప్రసాద్ ఎంట్రీ ఇచ్చారు.అసలు తామెవరికి సినిమా అమ్మలేదని స్వంతంగా రిలీజ్ చేసుకున్నామని తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన కలెక్షన్లు వస్తున్నాయని మీడియాకు పంపిన ప్రత్యేక నోట్ లో పేర్కొన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి