పండుగ సమయాలలో సినిమాలను విడుదల చేయడం అనేది నిర్మాతలకు ఎంతో ఇష్టమైన పని. ఎందుకంటే
పండుగ సమయాలలో విడుదలయ్యే సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా ఈ
దీపావళి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడానికి సిద్ధమైందని చెప్పాలి. అయితే ఈ
దీపావళి మాత్రం తెలుగు సినిమాలు పెద్దగా క్రేజీ లేని సినిమాలు విడుదల అవుతూ ఉండడం సినీ ప్రేక్షకులను కొంత నిరాశ పరుస్తుంది.
ఇద్దరు
తమిళ స్టార్ హీరోల సినిమాలు తప్ప
దీపావళి కానుకగా తెలుగు పెద్ద హీరోల సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు అనే విషయం ఇప్పుడు వారిని ఎంతగానో నిరోత్సాహపరుస్తుంది అని చెప్పాలి.
విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న ఓరి దేవుడా సినిమాతో పాటు మంచు విష్ణు హీరోగా నటిస్తున్న జిన్నా అనే
సినిమా కూడా విడుదల కాబోతున్నాయి. ఈ రెండు
సినిమా కూడా యావరేజ్ హీరోల సినిమాలే కావడం నిజంగా అభిమానులను కొంత నిరుత్సాహ పరుస్తుంది అని చెప్పాలి.
ఇకపోతే మరో రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. తెలుగులో తమిళంలో భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతలను కలిగి ఉన్న హీరోలైన
శివ కార్తికేయన్ మరియు కార్తీ ఇద్దరు నటించిన సినిమాలు ఇవి. ఆ విధంగా వీరిద్దరి మధ్య ఇప్పుడు తెలుగులో కూడా పోటీ భారీ స్థాయిలో ఏర్పడింది అని చెప్పాలి. తమిళంలో వీరి సినిమాలకు ఇప్పటికే భారీ స్థాయిలో పోటీ ఏర్పడగా తెలుగులో సరైన
సినిమా లేకపోవడంతో ఈ ఇద్దరికి తెలుగులో కూడా మంచి పోటీ ఏర్పడింది అని చెప్పాలి. కార్తీకి ఇప్పటికి తెలుగులో మంచి క్రేజ్ ఉంది.
శివ కార్తికేయన్ కి కూడా ఇప్పుడిప్పుడే తెలుగులో మంచి క్రేజీ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాలు మంచి విజయం సాధిస్తే కనుక వీరికి భారీ స్థాయిలో తెలుగు లో
మార్కెట్ క్రియేట్ అవుతుంది అని చెప్పాలి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ రానుంది.