ఈసంవత్సరం అక్కినేని హీరోలకు ఏమాత్రం కలిసి వచ్చినట్లు కనిపించడంలేదు. సంవత్సర ప్రారంభంలో విడుదలైన ‘బంగార్రాజు’ ఒక మోస్తరు విజయాన్ని అందుకుంటే ఆతరువాత విడుదలైన నాగచైతన్య ‘థాంక్యూ’ లేటెస్ట్ గా వచ్చిన నాగార్జున ‘ది ఘోస్ట్’ ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో అక్కినేని కాంపౌండ్ దిగాలు పడిపోయింది.
ఇలాంటి పరిస్థితులలో అక్కినేని వారసుడు అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ అయినా అక్కినేని అభిమానులకు జోష్ ను కలిగిస్తుంది అనుకుంటే ఇప్పుడు ‘ఏజెంట్’ విడుదల పూర్తి కన్ఫ్యూజన్ లో పడిపోయింది అన్నవార్తలు వస్తున్నాయి. వాస్తవానికి ఈమూవీ ఆగస్ట్ 12 విడుదలన్నారు. అయితే అది వాయిదా పడింది.
ఆతరువాత ఈమూవీ డిసెంబర్ లో వస్తుంది అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన వార్తల ప్రకారం ఈ సంవత్సరం ‘ఏజెంట్’ విడుదల ఉండకపోవచ్చు అంటున్నారు. ఈమూవీని సంక్రాంతికి విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ‘ఆదిపురుష్’ ‘వాల్తేర్ వీరయ్య’ ‘వారసుడు’ లాంటి భారీ సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇన్ని భారీ సినిమాల మధ్య ‘ఏజెంట్’ కు చోటు దక్కకపోతే రిపబ్లిక్ డేకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండకపోవచ్చు అని అంటున్నారు. అయితే ఆసమయానికి షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ తో పోతెపడాలి. దీనితో ఇది జరిగే పనేనా అని అంటున్నారు. అలా కూడ కుదరక పోతే ఈమూవీ సమ్మర్ రేస్ కు వెళ్ళిపోతుంది అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఇప్పటికే వరస ఫ్లాపులు తరువాత ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ తో ట్రాక్ లోకి వచ్చినప్పటికీ అఖిల్ కెరియర్ కు మళ్ళీ ‘ఏజెంట్’ అడ్డుకట్ట వేస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. నాగార్జున 100వ సినిమాలో అఖిల్ తన తండ్రితో కలిసి నటిస్తాడు అని అంటున్నారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అఖిల్ కెరియర్ ఇంకా సెట్ కాకపోవడంతో నాగ్ మధనపడుతూ తన కొడుకు కెరియర్ గురించి అదేవిధంగా నేటితరం ప్రేక్షకులలో తగ్గిపోతున్న అక్కినేని హీరోల క్రేజ్ గురించి నాగార్జున తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు టాక్..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి