ఇప్పుడు ఓటీటి సినిమా తిరిగి థియేటర్లోకి వస్తుండడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. గడిచిన రెండు సంవత్సరాల క్రితం కోవిడ్ మహమ్మారి వల్ల లాక్డౌన్ నిర్ధారిస్తున్న సమయంలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఓటిటి నే ఎంటర్టైన్మెంట్ చేసిందని చెప్పవచ్చు. అలా ఓటీటి లో విడుదలైన కలర్ ఫోటో చిత్రం ఇప్పుడు తాజాగా థియేటర్లోకి వస్తూ ఉండడంతో సరికొత్త ట్రెండ్ అని చెప్పవచ్చు. యూట్యూబ్ సుహాన్, షార్ట్ ఫిలిం చాందిని చౌదరీ కలిసి నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సందీప్ దర్శకత్వం వహించారు అలాగే 68వ జాతీయ చలనచిత్ర అవార్డులు ఈ చిత్రం ఉత్తమ చిత్రంగా కూడా తెలుగు ప్రేక్షకులు మనసును గెలుచుకుంది.ఈ సినిమా విడుదల ఇప్పటికి రెండు సంవత్సరాలు కావస్తున్న ఈ సినిమాని థియేటర్లో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ 19 కలర్ ఫోటోషను మొదటిసారిగా బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మంచి గుర్తింపు దక్కడంతో థియేటర్ రిలీజ్ తో మరింత గుర్తింపు దక్కుతుందని చిత్ర బంధం చాలా నమ్మకంతో ఉన్నారు అందుచేతనే ఈ సినిమాని రీ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక తర్వాత చాందిని చౌదరి, సుహాన్ కు పలు చిత్రాలను నటించే అవకాశాలు వచ్చాయి. మరి ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి