టాలీవుడ్ లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి అతి తక్కువ సమయం లోనే స్టార్ స్టేటస్ ని తెచ్చుకున్న హీరోలు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు..ఆ అతి తక్కువమంది లో ఒకడే విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు అనే సినిమా తో హీరో గా మొదటి సక్సెస్ ని అందుకున్న విజయ్, ఆ తర్వాత విడుదలైన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు..హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా క్రేజ్ పెంచుకుంటూ పోతున్న హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకడైతే.
ఆయన తర్వాత అదే రేంజ్ లో వెళ్తున్న ఫ్యూచర్ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఒకరు అని చెప్పొచ్చు..పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి , గీత గోవిందం మరియు టాక్సీ వాలా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్న విజయ్ దేవరకొండ కి గత నాలుగేళ్ల నుండి సక్సెస్ లేదు..ఇటీవలే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసిన లైగర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

అంత పెద్ద ఫ్లాప్ తగిలిన తర్వాత కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ లో ఇసుమంత కూడా తగ్గలేదు..ఇండియా లో నెంబర్ 1 బ్రాండ్ గా కొనసాగుతున్న 'థమ్స్అప్' కి సౌత్ లో విజయ్ దేవరకొండ బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నాడు..దీనితో పాటు మరి కొన్ని ప్రముఖ కమర్షియల్ యాడ్స్ కూడా విజయ్ ఖాతా లో ఉన్నాయి..అంతే కాకుండా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ మరియు టాప్ డైరెక్టర్స్ అందరూ విజయ్ దేవరకొండ డేట్స్ కోసం పడిగాపులు కాస్తున్నారు..ఇది ఇలా ఉండగా విజయ్ దేవరకొండ కి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కింది..ఇక అసలు విషయానికి వస్తే అబుదాబి లో UFC - MMA ఛాంపియన్ షిప్ లీగ్ కొనసాగుతుంది.

ఈ టోర్నమెంట్ ఓపెనింగ్ కి ముఖ్య అతిధి గా విజయ్ దేవరకొండ కి ఆహ్వానం దక్కింది..విజయ్ దేవరకొండ తో పాటుగా రణవీర్ సింగ్ కూడా ఈ లీగ్ ఓపెనింగ్ కి హాజరయ్యాడు..టాలీవుడ్ నుండి పాన్ ఇండియా స్టార్ హీరో ఇమేజి ని దక్కించుకున్న రామ్ చరణ్ మరియు ప్రభాస్ వంటి హీరోలకు కూడా ఇలాంటి గౌరవం దక్కలేదు అనే చెప్పాలి..ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమా చేస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..సమంత ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతుంది..డిసెంబర్ 24 వ తేదీన ఈ చిత్రాన్ని ఘనంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: