త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలి సిందే. మొదటి షెడ్యుల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యొక్క రెండవ షెడ్యూల్ తొందరలోనే మొదలు పెడుతున్నారు. అయితే మొదటి షెడ్యూల్లోని యాక్షన్ సన్నివేశాల ను మెచ్చని మహేష్ బాబు ఇప్పుడు ఆ సన్నివేశాలను రీషూట్ చేయాలనీ దర్శకుడు త్రివిక్రమ్ కు సూచించారట. ఆ విధంగా త్రివిక్రమ్ మళ్ళీ మొదటి షెడ్యూల్ మొత్తాన్ని షూ ట్ చేయనున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు ఏప్రిల్ 28వ తేదీన విడుదలను అనౌన్స్ చేయగా అది అప్పటివరకు మారుతుంది అని చెబుతున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయంలో ఏ విధంగానూ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ చిత్రాన్ని ఇం తటి ఆలస్యంగా చేయడానికి ప్లాన్ చేసిన మహేష్ బాబు ఇప్పుడు చిత్రీకరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తపరచడం సినిమా విడుదల తేదీపై ఎంతో ఎఫెక్ట్ పడే అవకాశం   ఉంది. దీంతో త్రివిక్రమ్ ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ప్లాన్ చెడిపోయిందనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో కానీ విజయ్ దేవరకొండ తో కానీ సినిమా చేయాల నే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు.
 
వారితో మే లోనే సినిమాను మొదలు పెట్టాలని భావించగా ఇప్పుడు మహేష్ చేసిన పని వల్ల ఈ సినిమా మరింత ఆలస్యం కానున్నట్లుగా తెలుస్తుంది. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత చాలా రోజులకు ఆయన సినిమాను మొదలు పెట్టాడు అంతకుముందు ఒక సినిమా పూర్తి చేసిన తర్వాత ఎక్కువ సమయం తీసుకోడు త్రివిక్రమ్. మరొక సినిమా మొదలు పెట్టడానికి ఆ విధంగా ఈ సినిమా ఇప్పుడు మొదలుపెట్టగా అది ఎప్పుడు పూర్తవుతుందో అన్న క్లారిటీ లేదు. పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: