‘ఊర్వశివో రాక్షసివో’ మూవీతో అల్లు శిరీష్ కు ఎంత కలిసివచ్చిందో ప్రస్తుతానికి క్లారిటీ లేకపోయినా ఆమూవీలో హీరోయిన్ గా నటించి ధారాళంగా అల్లు శిరీష్ కు లిప్ లాక్ లు ఇచ్చిన అను ఇమాన్యువల్ కు దశ తిరిగినట్లు కనిపిస్తోంది. 2016లో నాని పక్కన ‘మజ్ను’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ఎన్ఆర్ఐ బ్యూటీ అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల పక్కన నటించే అవకాశాలు వచ్చినప్పటికీ ఆ రెండు సినిమాలు సూపర్ ఫ్లాప్ లుగా మారడంతో ఈమెకు ఐరన్ లెగ్ హీరోయిన్ ట్యాగ్ ఇచ్చారు. దీనితో ఈమెకు అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈమె అల్లు శిరీష్ పక్కన ‘ఊర్వశివో రాక్షసివో’ మూవీలో ఛాన్స్ కొట్టింది. ఈసినిమాలో నటిస్తున్న సమయంలో ఈమె అల్లు శిరీష్ తో సన్నిహితంగా ఉంటోంది అంటు గాసిప్పులు కూడ వచ్చాయి. ఈగాసిప్పులను శిరీష్ ఖండించాడు. అయితే ఈమూవీలో వీరిద్దరి లవ్ ట్రాక్ సీన్స్ చాల ఘాటుగా ఉండటంతో మళ్ళీ ఈమె వార్తలలోకి వచ్చింది. ఈసినిమా విడుదలైన వెంటనే తమిళ హీరో కార్తి పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈమె పట్ల టాలీవుడ్ దర్శకులు ఆలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో తీస్తున్న మూవీలో పూజ హెగ్డే మెయిన్ హీరోయిన్ అయినప్పటికీ మరొక కీలకమైన సెకండ్ హీరోయిన్ పాత్ర కూడ ఉంది అని అంటున్నారు. ఇప్పుడు ఈసెకండ్ హీరోయిన్ పాత్రకు త్రివిక్రమ్ అనూ తో చర్చలు జరుపుతున్నట్లు టాక్. అదేవిధంగా కొరటాల శివ త్వరలో జూనియర్ తో ప్రారంభించబోతున్న మూవీలో కూడ సెకండ్ హీరోయిన్ పాత్రకు అను ఓకె చేసింది అని టాక్.


పారితోషిక విషయంలో పెద్దగా బేరసారాలు ఆడకుండా టాప్ హీరోల సినిమాలలో తనకు ఛాన్స్ ఇస్తే చాలు అది సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా తనకు అభ్యంతరం లేదు అన్న సంకేతాలు ప్రస్తుతం ఈమె ఇస్తూ ఉండటంతో ఈమెకు మళ్ళీ భారీ సినిమాలలో అవకాశాలు వస్తున్నాయి అన్నప్రచారం జరుగుతోంది. రష్మిక పూజా హెగ్డేలు చాల బిజీగా ఉండటంతో పాటు భారీ పారితోషికాలు డిమాండ్ చేస్తున్న పరిస్థితులలో గ్లామర్ తో పాటు నటన కూడ చేయగల అనూకు మళ్ళీ అవకాశాలు క్యూ కడుతున్నాయి అని అంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: