టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన హాట్ హాట్ అందాలతో యూత్ లో చాలా క్రేజ్ ని సంపాదించుకుంది. ఇప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తూ దూసుకుపోతుంది. ఇక సమంత కీలక పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'యశోద'. 'శ్రీదేవి మూవీస్' బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాని హరి, హరీష్ డైరెక్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ నవంబర్ 11న విడుదల అయ్యింది.సరోగసి కంటెంట్ నేపథ్యంలో సాగే కథాంశంతో..సస్పెన్స్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఇంకా అది మాత్రమే కాకుండా సినిమాలో ఇంకా చాలా సర్ప్రైజ్ లు ఉన్నాయి.ఫస్ట్ డే పాజిటివ్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ వీకెండ్ ను చాలా బాగానే క్యాష్ చేసుకుంది.అయితే వీక్ డేస్ లో మాత్రం ఈ సినిమా బాగా డౌన్ అయ్యింది.


ఎందుకంటే టాలీవుడ్ లెజెండరి హీరో కృష్ణ గారి మరణం వల్ల ఈ మూవీ కలెక్షన్స్ బాగా తగ్గాయి.అయితే రెండో వీకెండ్ కు మళ్ళీ కోలుకుని ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ని సాధించింది. 13వ రోజు కూడా ఈ మూవీ పర్వాలేదు అనే రీతిలో వసూళ్లు సాధించి ఓకే అనిపించింది. ఒకసారి 13రోజుల కలెక్షన్లను గనుక గమనిస్తే..'యశోద' సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ మొత్తం రూ.11.5 కోట్లుగా ఉందని ట్రేడ్ పండితుల నుంచి సమాచారం తెలుస్తుంది. 10 రోజుల్లో బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ మూవీ 1 రోజుల్లో రూ.14 కోట్ల దాకా షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా ఈ మూవీ బయ్యర్స్ కు రూ.2 కోట్ల దాకా లాభాలను అందించి సూపర్ హిట్ దిశగా దూసుకుపోతుంది.అయితే ఓవర్ సీస్ లో మాత్రం ఈ సినిమా ఊహించినంత వసూళ్లను రాబట్టలేకపోయింది.కేవలం 750k డాలర్స్ మాత్రమే వసూలు చేసింది.1 మిలియన్ డాలర్లు వసూళ్ళు రాబడుతుందనుకుంటే కేవలం 750k డాలర్లకే పరిమితం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: