సమంత ఆరోగ్యం పై కోలీవుడ్ మీడియాలో వచ్చిన గాసిప్పుల పై సమంత కుటుంబ సభ్యులు క్లారిటీ ఇచ్చినప్పటికీ సమంత ఇంకా ఎక్కడా ఓపెన్ గా కనిపించక పోవడంతో ఆమె అభిమానులకు ఇంకా భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నాగచైతన్య శోభిత ధూళిపాళ లు కలిసి ఒక ఔటింగ్ లో తిరుగుతున్నట్లు లేటెస్ట్ గా సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఫోటోను చూసి సమంత అభిమానులు చైతన్య పై ఆగ్రహంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


గత కొన్ని నెలలుగా చైతన్య శోభిత లు చాల సన్నిహితంగా ఉంటున్నారు అంటూ సోషల్ మీడియాలో గాసిప్పులు హడావిడి చేసిన పరిస్థితులలో అటు శోభిత ఇటు నాగచైతన్య ఆ పుకార్లను ఖండించిన విషయం తెలిసిందే. తాము కేవలం మంచి స్నేహితులం మాత్రమే అంటూ వారిద్దరు చెపుతున్నప్పటికీ వారిద్దరి మధ్య ఎదో నడుస్తోంది అంటు వస్తున్న గాసిప్పు వార్తలు ఆగడం లేదు.


లేటెస్ట్ గా చైతన్య తన పుట్టినరోజునాడు లండన్ వెళ్ళాడని అక్కడ శోభిత చైతూ తో కలిసి ఔటింగ్ కు వెళ్ళినప్పుడు వీరిద్దరినీ గుర్తుపట్టిన ఒక వ్యక్తి ఆ ఫోటోను తీసి సోషల్ మీడియాకు లీక్ చేసాడు అని అంటున్నారు. అయితే చైతూ సన్నిహితులు మాత్రం ఈ ఫోటో ఇప్పటిది కాదనీ వారిద్దరూ ఎప్పుడో కలిసిన ఫోటోను ఇప్పుడు లీక్ చేసారని వాదిస్తున్నారు.


సమంత అనారోగ్యం పై వస్తున్న వార్తలు ఒకవిధంగా ఆమెతో ప్రస్తుతం సినిమాలు తీస్తున్న నిర్మాతలకు టెన్షన్ పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా గుణశేఖర్ సమంతను శకుంతల గా మార్చి తీసిన ‘శాకుంతలం’ మూవీ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ దీనిని దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేసి తీరాలి. దీనికోసం సమంత సహకారం చాల అవసరం. అలాగే విజయ్ దేవరకొండ తో ఆమె నటిస్తున్న ‘ఖుషీ’ షూటింగ్ కూడ ఇంకా పూర్తి కావలసి ఉంది. ఇలాంటి పరిస్థితులలో ఆమె త్వరగా కోలుకోవాలని ఆమెతో సినిమాలు తీస్తున్న దర్శక నిర్మాతలు కోరుకుంటున్నారు..మరింత సమాచారం తెలుసుకోండి: