సూపర్  స్టార్  మహేష్  బాబు  త్రివిక్రమ్  శ్రీనివాస్ తో తన 28 వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకి బ్రేకులు పడుతున్న సంగతి తెలిసిందే. దానికి కారణం మహేష్ కి వున్న పరిస్థితులే. వరుసగా తన తల్లిదండ్రులు, అన్నయ్య చనిపోవడం ఒక కారణం అయితే ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే స్క్రిప్ట్ నచ్చకపోవడం. స్క్రిప్ట్  అసంతృప్తితో మళ్ళీ కొన్ని మార్పులు చేయమని త్రివిక్రమ్ ని అడగగా ఆయన పూర్తిగా స్క్రిప్ట్ మార్చినట్లు సమాచారం తెలుస్తుంది. మార్చిన స్క్రిప్ట్ మహేష్ కి నచ్చి ఇక షూటింగులో పాల్గొనబోతున్నట్లు ఇటీవల సమాచారం తెలిసింది.అయితే ముందుగా ఫినిష్ చేసిన యాక్షన్ షెడ్యూల్ మొత్తం కూడా క్యాన్సిల్ చేసినట్లుగా మరొక సమాచారం వినిపిస్తోంది. ఇక ఇప్పుడు మళ్లీ ఫ్రెష్ గా సినిమాను మొదలుపెట్టే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తోంది. మరోసారి తొలి షెడ్యూల్ డిసెంబర్ తొలి వారంలోని మొదలుపెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.


ఈసారి అయితే అసలు బ్రేక్ ఇవ్వకుండా అనుకున్న సమయానికి సినిమా షూటింగ్ ని చాలా ఫాస్ట్ గా పూర్తి చేయాలి అని త్రివిక్రమ్, మహేష్ బాబు ఫిక్స్ అయినట్లుగా సమాచారం తెలుస్తోంది.గతంలో కూడా దూకుడు సినిమా విషయంలో ఇలానే జరిగింది. ఆ సినిమా సినిమా స్క్రిప్ట్  మహేష్ కి మొదట నచ్చకపోవడంతో తరువాత బ్లాక్  బస్టర్ స్క్రిప్ట్  రెడీ చేసి మహేష్ కి శ్రీను వైట్ల వినిపించాడు. దాంతో ఆ సినిమా 2011లో చాలా పెద్ద బ్లాక్  బస్టర్ హిట్  అవ్వడం జరిగింది. ఇక మరోసారి ఆ సిట్యుయేషన్ ఈ సినిమాకి ఎదురైంది. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుందో వచ్చే ఏడాది సమ్మర్ దాకా ఆగాల్సిందే..ఈ సినిమాలో మహేష్ కి జోడీగా పూజా హెగ్డే నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా తరువాత మహేష్  రాజమౌళితో సినిమా చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: