ప్రభాస్ పెళ్ళి గురించి వార్తలు రాయడం మీడియాకు హాబి. గతంలో ప్రభాస్ అనుష్క ను పెళ్ళి చేసుకోబోతున్నాడు అంటూ అనేక గాసిప్పులను ప్రచారంలోకి తీసుకు వచ్చింది. ఆ గాసిప్పులు చాల కాలం హడావిడి చేసిన తరువాత మాత్రమే ప్రభాస్ వాటిని ఖండించి అనుష్క తన స్నేహితురాలు మాత్రమే అంటూ ఆ గాసిప్పులకు తెర దించాడు. కృష్ణంరాజు జీవించి ఉన్న రోజులలో ఆయన మీడియా ముందుకు వచ్చినప్పుడల్లా ప్రభాస్ పెళ్ళి గురించి ప్రశ్నలు అడుగుతూ ఉండేవారు.


ఆమధ్య కృష్ణంరాజు చనిపోయిన తఃరువాత ప్రభాస్ ప్రేమ పెళ్ళి పై ఊహాగానాలు కొంతకాలం నిలిచి పోయాయి. ఇప్పుడు మళ్ళీ బాలీవుడ్ మీడియా ప్రభాస్ ప్రేమ గురించి సరికొత్త ప్రచారం మొదలు పెట్టింది. కేవలం ఊహాగానాలు మాత్రమే కాకుండా ప్రభాస్ కృతి సనన్ ను ప్రేమిస్తున్నాడు అంటూ కొన్ని ఉదాహరణలు కూడ చూపెడుతోంది.


ఆమధ్య అయోధ్యలో ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ సందర్భంగా ప్రభాస్‌ తో కృతి చాలా సన్నిహితంగా మెలగడమే కాకుండా అతడికి చెమట పడుతుంటే ఆమె చున్నీని ఇవ్వడం ఒక ఉదాహరణగా బాలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా వరుణ్ ధావన్ కృతి సనన్ తో కలిసి నటించిన ‘బేడియా’ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ ఒక ఆసక్తికర కామెంట్ చేసినట్లు తెలుస్తోంది.


కృతి మనసులో ఒక వ్యక్తి ఉన్నాడని ఆవ్యక్తి ఇప్పుడు ముంబాయిలో లేడని వేరే చోట దీపికా పదుకొనె తో కలిసి షూటింగ్ చేస్తున్నాడు అంటూ సరదాగా చేసిన జోక్ ఆధారంగా బాలీవుడ్ మీడియా ప్రభాస్ కృతి సనన్ లను టార్గెట్ చేస్తూ మళ్ళీ పుకార్లు పుట్టిస్తోంది. ప్రభాస్ ప్రస్తుతం దీపిక తో కలిసి ఒక సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఆవిషయాన్ని దృష్టిలో పెట్టుకుని వరుణ్ ఇలా కామెంట్స్ చేసాడా లేక కృతిని ఆట పట్టించడానికి ఇలా సరదాగా జోక్ చేసాడా అన్నవిషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: