సెన్సేషనల్ డైరెక్టర్  అయిన రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. ఇక ఆర్ ఆర్ ఆర్ తర్వాత రాజమౌళి చేయనున్న ఈ సినిమాపై ఇప్పటికీ ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి.అయితే ఈ అంచనాలు మరింత పెరిగేలా మహేశ్ తో తాను ‘గ్లోబ్ ట్రాటింగ్’ సినిమా చేస్తున్నానని చెప్పాడు రాజమౌళి. కాగా ఇండియానా జోన్స్ స్టైల్ లో ఉండే సినిమాని ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నానని జక్కన చెప్పి, ఈసారీ తాను పాన్ ఇండియా సినిమా కాదు పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాను అనే హింట్ ఇచ్చాడు. 

అయితే ఇక  ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ క్యాంపెయిన్ లో భాగంగా అమెరికాలో బిజీగా ఉన్న రాజమౌళి ఇటివలే హైదరాబాద్ తిరిగొచ్చాడు. ఇదిలావుంటే ఇక గ్రాండ్ గా జరిగిన ‘హిట్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన రాజమౌళి, రెండు నెలలుగా ఇంగ్లీష్ లో మాట్లాడి మాట్లాడి ఇప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే హాయిగా ఉందని అందరినీ నవ్వించాడు.ఇకపోతే ఇదే వేదికపై యాంకర్ సుమ, మహేశ్ బాబు సినిమా ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనే ప్రశ్నలు అడిగింది.

అయితే  ఈ క్వెషన్స్ వినగానే జక్కన్న నవ్వుతూ… “సినిమా ఎప్పుడు చేసినా ప్రీరిలీజ్ ఈవెంట్ కి మాత్రం సుమనే యాంకర్” అంటూ సమాధానం చెప్పాడు.ఇక  దీంతో స్టేజ్ పైన ఉన్న వాళ్లందరూ ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ని చూసి ఎంజాయ్ చేశారు. మహేశ్ రాజమౌళి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయానికి వస్తే, #SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ స్టార్ట్ అవ్వాలి అంటే ముందు మహేశ్ త్రివిక్రమ్ తో చేస్తున్న #SSMB28 సినిమా కంప్లీట్ అవ్వాలి. కాగా 2023 మార్చ్ లోపు #SSMB28 షూటింగ్ పార్ట్ ని మహేశ్ కంప్లీట్ చేసి, ఆ తర్వాత రాజమౌళి సినిమా కోసం రెడీ అవ్వాలి, ఈలోపు జక్కన #SSMB29 ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయాలి. అయితే దాదాపు ఈ సినిమా 2023 డిసెంబర్ వరకూ సెట్స్ పైకి వెళ్లే అవకాశం కనిపించట్లేదు.  రిలీజ్ ఎప్పుడు అంటారా? ఆ ప్రశ్నకి సమాధానం రాజమౌళికి తెలిసే అవకాశం లేదు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: