ఈ ఏడాది బ్లాక్ బస్టర్ విజయాలు సాధించిన చిత్రాలలో డీజే ఇల్లు కూడా ఒకటి సిద్దు జొన్నలగడ్డ , నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. విడుదలైన మొదటి రోజే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని భారీ వసూళ్లను సాధించింది. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాలు విడుదల చేయాలా? వద్దా ? అనే సందిగ్ధంలో ఉన్నప్పుడు టాలీవుడ్ దర్శక నిర్మాతలకు డీజెటిల్లు ఊరట ఇచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి మంచి గుర్తింపు కోసం ఎదురు చూస్తున్న సిద్దుకి కూడా ఈ చిత్రం మంచి విజయాన్ని అందించింది.


తెలంగాణ యాస లో సిద్దు చెప్పే డైలాగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.  దానికి తోడు నేహా శెట్టి అందాల ఆరబోత సినిమాను బ్లాక్ బాస్టర్ హిట్ చేశాయి. ఇకపోతే ఇటీవల ఈ సినిమా సీక్వెల్ ప్రారంభమైంది.  డిజె టిల్లులో నేహా శెట్టి పాత్రకు ఎండింగ్ పడిన విషయం తెలిసిందే. కానీ సీక్వెల్లో హీరోయిన్ కోసం మొదట శ్రీ లీలాను ఎంపిక చేశారు . కానీ మిగతా భారీ చిత్రాలలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమా నుంచి తప్పుకుంది.  ఈమె ప్లేస్ లో అనుపమను నిర్మాతలు తీసుకొచ్చారు అయితే ఇప్పుడు అనుపమ కూడా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం అనుపమ స్థానంలో ప్రేమమ్ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయితే అధికారిక ప్రకటన అయితే ఇంకా వెలువడ లేదు. మరొకవైపు దర్శకుడు విమల్ కృష్ణ హీరోతో విభేదాలు రావడంతో తప్పుకున్నాడు . ఆయన ప్లేస్ లో మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు ఎంట్రీ ఇస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్యదేవరనాగ వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి కూడా కథను సిద్ధూ అందించాడు.  ప్రస్తుతం ఈయన మరో రెండు ప్రాజెక్టులపై సైన్ కూడా చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: