టాలీవుడ్ స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మన బాలయ్య బాబు మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు..ఇక ఆయన మంచి మూడ్ లో ఉంటె తన చుట్టుపక్కన ఉన్నవాళ్ళందరికి మాంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది..అయితే ఒకవేళ మూడ్ బాలేనప్పుడు ఎవరైనా తింగరి వేషాలు వేస్తె బాలయ్య చేతిలో బదితపూజ తప్పదు..ఇక అది ఫ్యాన్స్ అయినా సరే,మూవీ టెక్నిషియన్స్ అయినా సరే ఆయనతో పనిచేసేటప్పుడు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని పని చెయ్యాలి..అయితే ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని తో వీర సింహా రెడ్డి అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది..ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ 'జై బాలయ్య' పాట సోషల్ మీడియా లో మరియు బయట ఎక్కడ చూసిన మారుమోగిపోతుంది.. ఇక ఇది ఇలా ఉండగా లేటెస్ట్ గా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లో బాలయ్య బాబు మూవీ యూనిట్ పై చాలా తీవ్రంగా కోపగించుకొని సెట్స్ నుండి వాక్ అవుట్ అయ్యినట్టు ఫిలిం నగర్ లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది.అసలు విషయానికి వస్తే వీరసింహా రెడ్డి మూవీ షూటింగ్ ప్రస్తుతం టర్కీ లో జరుగుతుంది..అయితే ఈ సినిమా షూటింగ్ సమయం లో కాస్ట్యూమ్స్ విషయం లో బాలయ్య బాబు చిరాకు పడ్డాడట..

దగ్గరుండి చూసుకోవాల్సిన డైరెక్టర్ నిర్లక్ష్యం చెయ్యడం తో బాలయ్య బాబు ఆగ్రహం కి సెట్స్ ఉన్న వాళ్ళందరూ బలవ్వాల్సి వచ్చింది..ఆ తర్వాత ఆయన మూడ్ ఖరాబ్ కావడం తో ఆరోజు షూటింగ్ నుండి నిష్క్రమించాడని ఫిలిం నగర్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది.ఇప్పుడు బాలయ్య బాబు ఛిల్ అయ్యాడని..రెగ్యులర్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడని తెలిసింది..ఇక డిసెంబర్ రెండవ వారం లో షూటింగ్ ని ముగించుకోబోతున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన థియేటర్స్ లో విడుదల చెయ్యబోతున్నట్టు సమాచారం..అయితే ఈ సినిమా తో పాటుగా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా కూడా విడుదల కాబోతుంది..ఇదిలావుంటే ఈ చిత్రం షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది..కాగా ఈ సంక్రాంతికి ఈ రెండు సినిమాలలో ఏది పై చెయ్యి సాధిస్తుంది అనేది అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: